పెంచిన విద్యుత్‌ చార్జీలు ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2023-06-26T02:17:44+05:30 IST

. విద్యుత్‌ చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌మీటర్లు పెట్టొద్దని సీపీఐ ఆధ్వర్యంలో 58వ డివిజన్‌ కృష్ణా హోటల్‌ సెంట ర్‌లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెంచిన విద్యుత్‌ చార్జీలు ఉపసంహరించాలి
కృష్ణా హోటల్‌ సెంటర్‌లో నిరసన తెలుపుతున్న సీపీఐ నేతలు జి.కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్‌

కమ్యూనిస్టుల నిరసన

అజిత్‌సింగ్‌నగర్‌, జూన్‌ 25: మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తే, ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి వాటిని అమలు చేయడం దుర్మార్గమని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. విద్యుత్‌ చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌మీటర్లు పెట్టొద్దని సీపీఐ ఆధ్వర్యంలో 58వ డివిజన్‌ కృష్ణా హోటల్‌ సెంట ర్‌లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్‌ సంస్ధలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా వినియోగదారులపై ట్రూ అప్‌ చార్జీలను మోపు తున్నారని సీపీఐ నేత దోనేపూడి శంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారులు కేవీ భాస్కరరావు, మల్లి, లక్ష్మి ప్రదర్శించిన కరెంట్‌ చార్జీల మోత వీధి నాటకం స్థానికులను ఆకట్టుకుంది. నేతలు కె.రామరాజు, తమ్మిన దుర్గ పాల్గొన్నారు.

ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి

రామలింగేశ్వరనగర్‌: ప్రజలపై ప్రభుత్వం మోపిన విద్యుత్‌ భారాలు తగ్గించకపోతే ఐక్య ఉద్య మాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు దోనే పూడి శంకర్‌ నాయకులకు పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వ ర్యంలో రామలింగేశ్వరనగర్‌లోని తిమ్మరాజు అప్పారావు గ్రంథాలయం వద్ద ఆదివారం విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, లంక దుర్గా రావు, మూలి సాంబశివరావు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో ఏడుసార్లు చార్జీల పెంపు

మొగల్రాజపురం: ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు పెంచిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. మొగల్రాజపురంలో 7వ డివిజన్‌ సీపీఎం కమిటీ అధ్వర్యంలో విద్యుత్‌ భారాలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహిం చారు. 2014లో వినియోగించుకున్న విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం దారుణమని కాశీనాథ్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన విద్యుత్‌ సంస్కరణలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో మరో దోపిడీకి తెర తీశారన్నారు. ప్రశ్నిం చాల్సిన పార్టీలు, ప్రభుత్వాలు బీజేపీ నామ స్మరణలో మునిగి తేలుతున్నాయని ఆయన విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు పుప్పాల కృష్ణ, నగర నాయకులు పటమట మురహరి, దావులూరి శ్రీనివాస్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:17:44+05:30 IST