దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పీవీ
ABN , Publish Date - Dec 24 , 2023 | 01:00 AM
దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మేధావి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పీవీ
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా
సత్యనారాయణపురం, డిసెంబరు 23: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మేధావి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం గిరి వీధిలో పీవీ నరసింహారావు విగ్రహం వద్ద 19వ వర్ధంతి 33వ డివిజన్ ఇన్‌చార్జి గార్లపాటి విజయకుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొండా ఉమామహేశ్వరరావు పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరచాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీని ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం ముందుకు వెళ్లాలన్నారు. డివిజన్ అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి సి. రవిబాబు, కోశాధికారి సి. శ్రీను, బీసీ నాయకులు సి.నాగయ్య, టీఎన్‌ఎస్‌ఎఫ్ సెంట్రల్ అధ్యక్షుడు ఎస్.మనోజ్, తెలుగుయువత అధ్యక్షుడు జె.సాయి, డివిజన్ కార్యనిర్వాహక కార్యదర్శులు పొట్ల్లూరి కృష్ణప్రసాద్, డి. మాధవ, కె.రామకృష్ణ పాల్గొన్నారు.