రైల్వే కార్మికులకు పనులు కల్పించండి
ABN , First Publish Date - 2023-08-02T00:16:17+05:30 IST
రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్ కాంట్రాక్ట్ సంస్థలు అక్రమంగా తొలగించిన పాత కార్మికులకు పనులు కల్పించి న్యాయం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు కోరారు
రైల్వే కార్మికులకు పనులు కల్పించండి
50వ డివిజన్ కార్పొరేటర్ సత్యబాబు
డీఆర్‌ఎం కార్యాలయం వద్ద నిరసన
రైల్వేస్టేషన్, ఆగస్టు 1: రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్ కాంట్రాక్ట్ సంస్థలు అక్రమంగా తొలగించిన పాత కార్మికులకు పనులు కల్పించి న్యాయం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు కోరారు. రైల్వే కార్మికులు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద మంగళవారం రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్ కాంట్రాక్ట్ సంస్థలు అక్రమంగా తొలగించినందుకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను అక్రమంగా, చట్ట విరుద్ధంగా పని నుంచి కాంట్రాక్టర్లు ఆపేస్తే ప్రిన్సిపాల్ ఎంప్లాయర్‌గా రైల్వే ఉన్నతాధికారులు తగిన చర్యలను చేపట్టి కార్మికులకు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. ఎప్పటి నుంచో స్టేషన్ పనులను నమ్ముకుని పని చేస్తున్న కార్మికులకు మళ్లీ పని కల్పించడం న్యాయమని తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే కార్మికులకు పని కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ ఎ.కమల, యూనియన్ కార్యదర్శి ఈవీ నారాయణ పాల్గొన్నారు.