నిరసనల హోరు.. న్యాయ పోరు..!

ABN , First Publish Date - 2023-09-26T00:07:29+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యే వరకు పోరుబాటను వీడేదిలేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం రిలేదీక్షలు చేశారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేశారు. టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావు, మాజీమంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సీమెన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరును సందర్శించి అక్కడ విద్యార్థులు శిక్షణ పొందిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గుడివాడలో తెలుగు మహిళలు మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు.

నిరసనల హోరు.. న్యాయ పోరు..!

చంద్రబాబు విడుదలయ్యే వరకు టీడీపీ శ్రేణుల పోరుబాట

- వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో సీమెన్స్‌ సెంటరును పరిశీలించిన ఉమ్మడి కృష్ణా టీడీపీ నాయకులు

- కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నాయకుల ఆందోళన

- వేకనూరులో జనసేన, టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ

- గుడివాడలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన తెలుగు మహిళలు

టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యే వరకు పోరుబాటను వీడేదిలేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం రిలేదీక్షలు చేశారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేశారు. టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావు, మాజీమంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సీమెన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరును సందర్శించి అక్కడ విద్యార్థులు శిక్షణ పొందిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గుడివాడలో తెలుగు మహిళలు మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలేదీక్షలు సోమవారం నాటికి 13వ రోజుకు చేరాయి. స్కిల్‌ డెవలప్‌మెట్‌లో శిక్షణపొందిన తాపీమేస్త్రీలు, టీడీపీ కార్యకర్తలు ఈ రిలేదీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు సోమవారం ఆందోళన చేశారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసుల దూకుడును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరంకి గురుమూర్తి, మాచవరపు ఆదినారాయణ తలశిల స్వర్ణలత, గోపు సత్యనారాయణ, బచ్చుల బోస్‌ తదితరులు పాల్గొన్నారు.

- చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలం పల్లెపాలెంలో రిలేదీక్ష జరిగింది. ఎన్టీఆర్‌ సోదరుడైన త్రివిక్రమ రామారావు మనుమడు నందమూరి యశ్వంత్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్నారు. నాగేశ్వరస్వామి దేవస్థానంలో చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కృత్తివెన్ను మండలపార్టీ అధ్యక్షుడు ఒడుగు తులసీరావు, నియోజకవర్గంలోని మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గపార్టీ కార్యాలయంలో జరిగిన రిలేదీక్షలో తెలుగు మహిళలు రిలేదీక్ష లో పాల్గొన్నారు. మహిళలు మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) రిలేదీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర టీడీపీ వాణిజ్యవిభాగం ప్రధానకార్యదర్శి గోకవరపు సునీల్‌ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ అంశంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ప్రజలకు వివరించారు. వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో బాబుతో నేను కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.

పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ బుజ్జి నేతృత్వంతో ముస్లీంలు రిలేదీక్షలో పాల్గొన్నారు. టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావు, మాజీమంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, బుద్దా వెంకన్న, వర్ల కుమార్‌రాజా, శ్రీరాంతాతయ్య, వెలగపూడి శంకరబాబు ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. అనంతరం ,వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సీమెన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరును వారు సందర్శించి అక్కడ విద్యార్థులు శిక్షణ పొందిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పెన మలూరు మండలం చోడవంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు కలపాల శ్రీధర్‌ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, టీడీపీ నాయకులు మారుమూడిధనకోటే శ్వరరావు, బోడె ఆనందప్రసాద్‌, ఎం రత్నకుమారి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

- అవనిగడ్డ గాంధీక్షేత్రం వద్ద చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ అవనిగడ్డ పంచాయతీ 8వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు రిలేదీక్షలో పాల్గొన్నారు. జిల్లా టీడీపీ ఉపాఽధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చంద్రబాబుపై అసత్య కథనాలు ప్రచురిస్తున్న జగన్‌పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. వేకనూరులో జనసేన, టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మండలి బుద్ధప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలోని గోపవానిపాలెంలో మర్రివాడ , గోపవానిపాలెంకు చెందిన తెలుగుమహిళలు ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనరిలేదీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-09-26T00:07:29+05:30 IST