న్యాయం గెలిచేదాకా... ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2023-09-22T23:24:33+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా 11వ రోజూ శుక్రవారం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆలయాల్లో పూజలు, చర్చిలలో ప్రార్థనలు జరుగుతున్నాయి. బాబుతో మేమంటూ వర్షంలోనూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. పలుచోట్ల జనసేన పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
- బాబుతోనే మేమంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు
- మచిలీపట్నంలో సర్వమత ప్రార్థనలు
- బందరుకోట రామాలయంలో ముగిసిన 36 గంటల పాటు భగవద్గీత పారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా 11వ రోజూ శుక్రవారం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆలయాల్లో పూజలు, చర్చిలలో ప్రార్థనలు జరుగుతున్నాయి. బాబుతో మేమంటూ వర్షంలోనూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. పలుచోట్ల జనసేన పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలో దీక్షా శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. గొడుగుపేట కోఠిసెంటరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పామర్రు మండల టీడీపీ, జనసేన నాయకులు ఆఽధ్వర్యంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాల వద్ద వర్షంలోనే నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే ఆశతో రిలేదీక్షల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఎదురుచూపులు చూశారు. బెయిల్ రాకపోవడంతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. వర్షాన్ని సౌతం లెక్కచేకుండా టీడీపీ శ్రేణులు రిలేదీక్షలో పాల్గొన్నారు.
గుడివాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత, తెలుగునాడు స్టూడెంట్ ఫోర్స్ నాయకులురిలేదీక్షలో పాల్గొన్నారు. బాబుతో మేము అంటూ గుడివాడ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి పోస్టుకార్డులను పంపారు.
చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నాటికి రిలేదీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో టీడీపీ కార్పొరేటర్లు, మండల, నగర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. చంద్రబాబును విడుదల కావాలని కోరుతూ దీక్షాశిబిరం వద్దసర్వమత ప్రార్థనలు చేశారు. బందరుకోట రామాలయంలో 36 గంటల నిరంతర భగవద్గీత పారాయణ శుక్రవారంతో ముగిసింది. బాబుతో నేను కరపత్రాలను నగరంలోని అన్ని డివిజన్‌లలో పంపిణీ చేశారు.
పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని టీడీపీ కార్యాయలయంలో పెనమలూరు మండల తెలుగు మహిళా విభాగం కార్యకర్తలు, నాయకులు రిలేదీక్షలో పాల్గొన్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు ఈ శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు.
అవనిగడ్డలో గాంధీక్షేత్రం వద్ద చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ అవనిగడ్డ మండల టీడీపీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో రిలేదీక్ష జరిగింది. చంద్రబాబును విడుదల చేయాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కోడూరులోని కనకదర్గమ్మ ఆలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు.
పెడన నియోజకవర్గం తోటమూలలోని పెడన నియోజక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్‌లెవల్ కన్వీనర్లు రిలేదీక్షలో పాల్గొన్నారు. పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. పెడన జెడ్పీటీసీ సభ్యుడు అర్జా నగేష్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖయ్యూం. లీగల్‌సెల్ కార్యదర్శి రంగనాథ్, పెడన మండలపార్టీ అధ్యక్షుడు శలపాటి ప్రసాద్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. గూడూరు మండలంలో దీక్షా శిబిరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పామర్రు నియోజకవర్గంలో పమిడిముక్కల మండలం వీరంకిలాకులో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రిలేదీక్ష చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ఈ దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ పామర్రు మండల టీడీపీ, జనసేన నాయకులు ఆఽధ్వర్యంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాల వద్ద వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ మత పెద్దలు తమ తమ మతాలకు చెందిన ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పాల్గొన్నారు.