దిశ చట్టంతో మహిళలకు రక్షణ

ABN , First Publish Date - 2023-03-05T00:28:37+05:30 IST

దిశా చట్టం మహిళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే ఒక మంచి సాధనం అని, ప్రతి మహిళ వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన పుడు తమ సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ లో లొకేషన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలని దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ వీవీ నాయుడు విజ్ఞిప్తి చేశారు.

దిశ చట్టంతో మహిళలకు రక్షణ
వీవీ నాయుడుని సన్మానిస్తున్న పీబీ సిద్ధార్థ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం, స్పృహాప్తి చారిటబుల్‌ ట్రస్టు, రోటరీ మిడ్‌ టౌన్‌ విజయవాడ సభ్యులు

దిశ చట్టంతో మహిళలకు రక్షణ

దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ వీవీ నాయుడు

మొగల్రాజపురం, మార్చి 4: దిశా చట్టం మహిళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే ఒక మంచి సాధనం అని, ప్రతి మహిళ వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన పుడు తమ సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ లో లొకేషన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలని దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ వీవీ నాయుడు విజ్ఞిప్తి చేశారు. పీబీ సిద్ధార్థ కళాశాల కంప్యూ టర్‌ సైన్స్‌ విభాగం, స్పృహాప్తి చారిటబుల్‌ ట్రస్టు, రోటరీ మిడ్‌ టౌన్‌ విజయవాడ సంయుక్తంగా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు పూర్తిగా చదువు మీదే దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతస్థానానికి చేరుకున్న తరువాత వివాహం గురించి ఆలోచించాలని సూచించారు. దిశ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రేవతి దిశ యాప్‌ సదుపాయాలను, ఎలా ఉపయోగించాలో చెప్పారు. అనంతరం వీవీ నాయుడిని సన్మానించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.మనోరంజని, స్పృహాప్తి చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకురాలు వి.భారతి, రోటరీ మిడ్‌టౌన్‌ విజయవాడ ఉపాధ్యక్షుడు జి.మురళీకృష్ణ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాపతి టిఎస్‌. రవికృష్ణ, అధ్యాపకులు కె .పరియా, ఎ. కవిత, పీజీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:28:37+05:30 IST