విజయవాడకు ప్రాధాన్యమివ్వండి

ABN , First Publish Date - 2023-01-29T01:47:28+05:30 IST

విజయవాడకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించాల్సిందిగా విజయవాడ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) శివేంద్ర మోహన్‌కు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు విజ్ఞప్తి చేశారు.

విజయవాడకు ప్రాధాన్యమివ్వండి

సింగ్‌నగర్‌లో శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయండి

రైల్వే మినీస్టేడియాన్ని సత్యనారాయణపురం తరలించండి : డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌తో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి శంకరరావు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించాల్సిందిగా విజయవాడ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) శివేంద్ర మోహన్‌కు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు విజ్ఞప్తి చేశారు. అఖిలభారత స్థాయిలో పోరాటాలతో బిజీగా ఉంటూ సుదీర్ఘకాలం తర్వాత విజయవాడ వచ్చిన శంకరరావు డీఆర్‌ ఎంను కలవటం ప్రాధాన్యం సంతరించు కుంది. డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌తో భేటీలో విజయవాడ మీద దృష్టి సారిం చాల్సిన అంశాల మీదనే చర్చ జరగింది. దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జం క్షన్‌గా ఉన్న విజయవాడలో ఏ1 రైల్వే స్టేషన్‌ను విస్తరించటానికి ఉన్న పరిసి ్థతులపై శంకరరావు అనేక అంశాలను ప్రతిపాదించినట్టు తెలిసింది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు ముందుగా ఉన్న పార్శిల్‌ ఆఫీసును ఎండ్‌ పాయింట్‌కు మార్చాలని ఆయన సూచన చేశారు. దీంతో విశాల మైన పార్కింగ్‌ ప్రదేశం వస్తుందని చెప్పా రు. రైల్వేస్టేషన్‌కు మూడు ప్రధాన మార్గా లున్నా.. అవన్నీ ఇరుగ్గా ఉండటం వల్ల అంతా పార్శిల్‌ బుకింగ్‌ వైపు వస్తున్నారు. పార్శిల్‌ ఆఫీసును మార్చటం ద్వారా బోలె డంత స్థలం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పార్శిల్‌ ఆఫీసుకు సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లోనూ ఎవరూ ఉండటం లేదని, ఒకరిద్దరు ఉంటే వారిని సత్యనా రాయణపురం తరలించి పాత క్వార్టర్స్‌ను డీమాలిష్‌ చేస్తే విశాలమైన స్థలం సమ కూరుతుందని తెలిపారు. రైల్వేస్టేషన్‌ ఎదురుగా రైల్వే మినీ స్టేడియం ఉందని, ఈ స్టేడియాన్ని ఇక్కడి నుంచి సత్యనారా యణపురం తరలించాల్సిందిగా ప్రతిపా దించారు. రైల్వే బుకింగ్‌ అంతా ఇక్కడి నుంచే చేపట్టే వ్యవస్థలు ఏర్పాటు చేసు కోవచ్చని తెలిపారు. బుకింగ్‌ చేసుకోవ టానికి వచ్చే వారికి విశాలమైన పార్కింగ్‌ సదుపాయం ఏర్పడుతుందన్నారు. రైల్వే అధికారులు కమర్షియల్‌ భవనాలు అయినా నిర్మించుకోవచ్చునని చెప్పారు. ఇదే సందర్భంలో డీఆర్‌ఎం ఆఫీసు వైపు ఇరుగ్గా ఉండటంతో అక్కడ ఉన్న రన్నింగ్‌ రూమ్‌ను రైల్వే స్కూల్‌కు మార్చటం ద్వారా ఆ ప్రాంతాన్ని విశాలంగా చేయ వచ్చునని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గుణదలలో శాటిలైట్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనపె ఈ సందర్భంగా డీఆర్‌ఎం, శంకరరావుకు వివరించినట్టుగా సమాచారం. దీనిపై శంకరరావు గుణదలను శాటిలైట్‌ స్టేషన్‌ చేయవద్దని, దాని బదులు సింగ్‌నగర్‌లో శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

మరో రాయనపాడులా గుణదల

గుణదలలో శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే మరో రాయనపాడు రైల్వే స్టేషన్‌గా మారుతుందని డీఆర్‌ఎంతో శంకరావు చెప్పారు. గుణదల రైల్వేస్టేషన్‌కు సరైన కనెక్టి విటీ లేదని, ప్రయాణికులు రాకపోకలు సాగించటం కష్టమని చెప్పారు. గుణదల రైల్వేస్టేషన్‌ కాకుండా సింగ్‌నగర్‌లో శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే మెయిన్‌ లైన్‌, బ్రాంచ్‌ లైన్‌ మీదుగా వెళ్లే రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వవచ్చునన్నారు. సింగ్‌నగర్‌ అభివృద్ధి చెందిన ప్రాంతమని, మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండటం వల్ల ఆటోలు, బస్సులు వంటివి తేలిగ్గా స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తాయని వివరించారు. ఈ ప్రతిపాదన పట్ల డీఆర్‌ఎం కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-01-29T01:47:29+05:30 IST