ప్రజాధనం మట్టిపాలు!

ABN , First Publish Date - 2023-09-04T00:13:58+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కారణంగా లక్షల రూపా యల విలువ చేసే ఉయ్యూరు నగర పంచాయతీ ఆస్తులు వృథాగా ఉండి మట్టిలో కలసిపోతున్నాయి.

 ప్రజాధనం మట్టిపాలు!
తుప్పుపట్టిపోతున్న నగర పంచాయతీ ట్రాక్టర్‌, ట్రక్కు

ఏళ్ల తరబడి నిరుపయోగంగా ట్రాక్టర్‌, రోడ్డు రోలర్‌

తుప్పుపట్టి మట్టిలో కలసిపోతున్నా, పట్టించుకోని నగర పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు

ఉయ్యూరు, సెప్టెంబరు 3 : అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కారణంగా లక్షల రూపా యల విలువ చేసే ఉయ్యూరు నగర పంచాయతీ ఆస్తులు వృథాగా ఉండి మట్టిలో కలసిపోతున్నాయి. పట్టణంలో చెత్త సేకరించేందుకు గ్రామ పంచాయ తీగా ఉన్న సమయంలో లక్షల రూపాయలతో ట్రాక్టర్‌, ట్రక్కు కొనుగోలు చేశారు. నిర్వహణా లోపం తో కొంతకాలానికి అవి మూలనపడగా ప్రధాన రహ దారి పక్కన ఉన్న జిల్లా పరిషత్‌కు చెందిన కార్యాలయ ఆవరణలో వాటిని ఉంచారు. తరువాత గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా రూపాంతరం చెందిన తరువాత, ఈ వాహనాలు ఇక్కడే వదిలివేసి పట్టించుకోపోవడంతో తుప్పుపట్టి మట్టిలో కలసి పోతున్నాయి. ఈ ఆవరణలో ఉన్న భవనాన్ని కొంతకాలం నగర పంచాయతీ కార్యాల యంగా వాడుకున్నారు. ఆ సమయంలో కూడా వాహ నాలను పట్టించుకున్నవారు లేరు. ఏళ్ల తర బడి వీటిని కదపక పోవడంతో మట్టిలో కూరు కుపోతూ తుప్పుపట్టి పాడైపోతున్నాయి. చెత్త సేకరించేందుకు నెలకు వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్‌ ట్రాక్టర్లు ఉపయోగిస్తున్న నగర పంచాయతీ అధికారులు పాత వాహనాలకు మరమ్మతులు చేయించడమో లేక అమ్మకానికి పెట్టడమో చేయడం లేదు. అధికా రులు మారుతున్నా ఒక్కరు కూడా వీటిగురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఇదే ఆవరణలో ఉన్న జిల్లాపరిషత్‌కు చెందిన పాత రోడ్డు రోలర్‌ ఏళ్ల తరబడి కదపక పోవడంతో మట్టిలో కూరుకు పోతుంది. నిరుప యోగంగా ఉండి మట్టిపాలవుతు న్నా వాహనాలను నగర పంచాయతీ అధికారులు కాని జిల్లా పరిషత్‌ అధికారులు పట్టించుకో పోవ డంతో ప్రజల ఆస్తులు మట్టిలో కలసి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజాధనం ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

Updated Date - 2023-09-04T00:13:58+05:30 IST