Share News

ప్రభుత్వ వైఫల్యంతోనే ముంపు

ABN , First Publish Date - 2023-12-11T01:29:38+05:30 IST

డ్రెయిన్లు, మురుగు కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫ్యల్యం రైతులను నిండాముంచిందని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకుడు కాకాని శ్రీనివాసరావు ఆరోపించారు.

 ప్రభుత్వ వైఫల్యంతోనే ముంపు
ముదునూరులో నీటిలో నానుతున్న పనల నుంచి మొలక వచ్చిన ధాన్యం చూపుతున్న రైతులు

ముదునూరు(ఉయ్యూరు), డిసెంబరు 10 : డ్రెయిన్లు, మురుగు కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫ్యల్యం రైతులను నిండాముంచిందని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకుడు కాకాని శ్రీనివాసరావు ఆరోపించారు. తుఫాన్‌ ప్రభావంవల్ల కురిసిన వర్షాలకు ఇప్పటికి ముదునూరు పొలాల్లో నీటిలో నానుతున్న వరిపనలు, నేలవాలి నీటిలో మురుగుతున్న వరి పంటను స్థానిక పార్టీ నాయకులు దూసర అజయ్‌, రాము, పాలడుగు బాలజీ, మహిళా నాయకురాలు మాధవీలత, రైతులతో కలసి ఆదివారం పరిశీలించారు. రైతులు నీటిలో నానుతున్న పనలు చూపి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుఫాన్‌ వల్ల ముంపునకు గురై రైతులు పంట నష్టపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లేరు ఆక్రమణలకు గురై చేపల చెరువులుగా మారడం వల్ల ముంపు నీరు పోయేమార్గం లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పంటలు ముంపునకు గురికాగా తడిసిన ధాన్యం అంతటిని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. పి.బాలభాస్కర్‌ త దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:29:40+05:30 IST