బాలిక మృతదేహానికి పోస్టుమార్టం
ABN , First Publish Date - 2023-03-29T01:18:44+05:30 IST
పోరంకిలోని ఒక ఇంట్లో రెండేళ్లుగా పని చేసుకుంటూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక శ్రావణి మృతదేహానికి ఎట్టకేలకు మంగళవారం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది.
పెనమలూరు, మార్చి 28 : పోరంకిలోని ఒక ఇంట్లో రెండేళ్లుగా పని చేసుకుంటూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక శ్రావణి మృతదేహానికి ఎట్టకేలకు మంగళవారం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. బాలిక మృతికి కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తేలాల్సి ఉంది. బాలిక మృతికి కారణాలు చెప్పాలని, పోలీసులకు కనిపించకుండా పారిపోయిన ఇంటి ఓనర్లు కా కర్ల రామకృష్ణ, శాంతమ్మ తమకు నిజానిజాలు తెలపాలన్నారు. బాలికను దారుణంగా కొట్టి చంపారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టే షను ఎదుట బాలిక తల్లి, బంధువులు నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు స్టేష ను వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళంలో బాలిక తల్లి స్పృహ తప్పి పడిపోయింది. స్థానిక సీపీఎం నేతలు ఆందోళనకు మద్దతుగా వచ్చారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లి ప్రమేయం లేకుండా ఫిర్యాదు ఇచ్చినట్టు నమోదు చేశారని ఇది సరికాదని ఆందోళన చేశారు. దీంతో బాలిక తల్లి తన కుమార్తెపై డబ్బు దొంగిలించిందనే నెపం మోపి తన కుమార్తెను కొట్టి చంపారని తిరిగి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బంధువులకు నచ్చచెప్పి బాలిక పోస్టుమార్టంకు బంధువులను ఒప్పించారు.