గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు

ABN , First Publish Date - 2023-03-19T00:59:40+05:30 IST

మండలంలోని పలుగ్రామాల్లో కోడిపందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయి.

గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు

ఉంగుటూరు, మార్చి 18 : మండలంలోని పలుగ్రామాల్లో కోడిపందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. మానికొండ, ఇం దుపల్లి, తేలప్రోలు, వేమండ, చికినాల, తుట్టగుంట, ఆత్కూరు త దితర గ్రామాల్లో కొంతమంది పేకాట, కోడిపందేలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. గతంలో పండుగల సందర్భంగా నిర్దేశితప్రాంతంలో మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు ఆయా గ్రామాల్లో నిత్యం గుట్టుచప్పుడు కాకుండా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఉంగుటూరు మండలం, మానికొండ గ్రామం కోడిపందేలకు అ డ్డాగా మారింది. అధికారపార్టీ నేతల అండదండలతో పందెంరాయుళ్లు అడ్డూ-అదుపు లేకుండా పందేలు నిర్వహిస్తున్నారు. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక పందెంరాయుళ్లు వాట్సాప్‌ గ్రూపుల్లో బృందంగా ఏర్పడి వివరాలు షేర్‌ చే సుకుంటూ నిర్దేశిత ప్రదేశానికి చేరుకుని పకడ్బందీగా కోడిపందే లు నిర్వహిస్తున్నారు. లక్షల్లో పందేలు వేస్తుండటంతో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. గ్రామంలోని జగనన్నకాలనీకి వెళ్లే రోడ్డుపక్కనున్న ఖాళీప్రదేశం, కాటూరు వెళ్లే రోడ్డు పక్కనున్న పామాయిల్‌ తోట, ఊరిచివరన తరిగొప్పల వెళ్లే రో డ్డు పక్కనున్న ఖాళీ ప్రదేశంలో పందెంరాయుళ్లు యథేచ్ఛగా కో డిపందేలు వేస్తున్నా, పోలీసులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎవరైనా సమాచారమిచ్చినా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు పందెంశిబిరాలపై తూ తూమంత్రంగా దాడు లు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

తుట్టగుంటలో జోరుగా పేకాట

తుట్టగుంట గ్రామం లో పేకాట జోరుగా సా గుతోంది. రబీ పంటల సీజన్‌ పూర్తయి ఖాళీగా ఉన్న పొలాల్లోని చెట్లకింద, తోటలు, కొన్ని ర హస్యప్రాంతాల్లో, పోలీసులకు అనుమానం రాకుండా పేకాటరాయుళ్లు రేయింబవళ్లు నిర్భయంగా జూదక్రీడ సాగిస్తున్నారు. అడపాదడపా జూదశిబిరాలపై పోలీసులు దాడులు చేస్తున్నా పేకాటరాయుళ్లు దొరకకుండా తప్పించుకుంటూ, మరోచోటికి మకాం మార్చేస్తున్నారు. సరదాగా మొదలై, తర్వాత జేబులను గుల్లచేస్తున్న పేకాట, కోడిపందేల జోలికి యువత పోకుండా పోలీసులు నిఘాపెట్టి అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-19T00:59:40+05:30 IST