నేటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం

ABN , First Publish Date - 2023-01-26T00:42:51+05:30 IST

పట్టణంలో ప్లాస్టిక్‌ క్యారీ బాగులు, ఫ్లెక్సీల వాడకాన్ని గురువారం నుంచి నిషేధిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ డి.బాలకృష్ణ తెలిపారు.

నేటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం
వ్యాపారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ బాలకృష్ణ

తిరువూరు, జనవరి 25: పట్టణంలో ప్లాస్టిక్‌ క్యారీ బాగులు, ఫ్లెక్సీల వాడకాన్ని గురువారం నుంచి నిషేధిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ డి.బాలకృష్ణ తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం వ్యాపారులు, ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో కమిషర్‌ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు అందరు సహకరించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ వినియోగంపై విషేధం విధించటం జరిగిందని, పట్టణంలో మున్సిపల్‌, ఆరోగ్య సిబ్బంది ప్రతిరోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణంలో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటుగా దోమల నిర్మూలనకు తగు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2023-01-26T00:42:51+05:30 IST