జరుగువానిపాలెం గ్రామస్థుల ఆందోళన
ABN , First Publish Date - 2023-03-02T00:48:48+05:30 IST
మంచినీటి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు చిన్న పైపులను వేయడాన్ని నిరసిస్తూ జరుగువానిపాలెం గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు.
కోడూరు, మార్చి 1 : మంచినీటి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు చిన్న పైపులను వేయడాన్ని నిరసిస్తూ జరుగువానిపాలెం గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో పైపులను తొలగించి కొత్త పైపులు వేసే విధంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఉన్న పైపుల కంటే చిన్న సైజు పైపులను తీసుకొచ్చి చెరువు వద్ద ఉంచారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు బుధవారం మం చినీటి చెరువు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. గతంలో కంటే చిన్న పైపులు వేయడాన్ని ఆక్షేపించారు. పెద్ద పైపులను వేయాలని, లేదా గతంలో ఉన్న పైపులనే వేయాలని డిమాండ్ చేశారు. జనాభా పెరుగుతున్న క్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ అందించే మంచినీరు సరిపోవటం లేదని, పైపులైన్ సైజు పెంచి మంచినీరు అందించాలని కోరామన్నారు. అప్పికట్ల రవీంద్ర, యర్రంశెట్టి దామోదర్, గ్రామస్థులు పాల్గొన్నారు.