Share News

బెదిరించి జనాన్ని తరలించారు

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:29 AM

‘175 స్థానాల్లో గెలవడం కాదు ముందు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోండి. మిమ్మల్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సామాజిక సాధికార సభలో చేసింది లేక, చెప్పేందుకు ఏమీలేక మంత్రులు, ఎమ్మెల్యేలు బేలముఖాలు వేసుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వలంటీర్లతో బెదిరించి సభకు జనాన్ని సమీకరించారని, లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చిన జనం కావడం వల్లనే సభ ప్రారంభం కాగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి.’’ అని వైసీపీ నేత లపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

బెదిరించి జనాన్ని తరలించారు

సాధికార సభ ప్రారంభం కాగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి: మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, డిసెంబరు 17: ‘‘175 స్థానాల్లో గెలవడం కాదు ముందు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోండి. మిమ్మల్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సామాజిక సాధికార సభలో చేసింది లేక, చెప్పేందుకు ఏమీలేక మంత్రులు, ఎమ్మెల్యేలు బేలముఖాలు వేసుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వలంటీర్లతో బెదిరించి సభకు జనాన్ని సమీకరించారని, లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చిన జనం కావడం వల్లనే సభ ప్రారంభం కాగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి.’’ అని వైసీపీ నేత లపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తూ చంద్రబాబు తన పాలనలో వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధు లను ఇతర పథకాలకు మళ్లించి ఆ వర్గాలను ముఖ్యమంత్రి జగన్‌ దెబ్బతీశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల చైర్మన్లకు కనీసం కార్యాలయాలు లేకుండా చేశాడన్నారు. నిధులు, విధులు లేని చైర్మన్లు దిక్కుతోచక తిరుగుతున్నారని అన్నారు. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం పేరుతో చంద్రబాబు వేలాది మంది విద్యార్థులకు మెరుగైన జీవితం అందిం చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చి అణగారిన వర్గాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. నేడు జగన్‌ పాలనలో ఆ వర్గాలు వెనుకడుగు వేస్తున్నాయన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 01:29 AM