కృష్ణాతరంగ్ ఓవరాల్ చాంపియన్‌గా పీబీ సిద్ధార్థ
ABN , First Publish Date - 2023-12-03T00:47:32+05:30 IST
సాంస్కృతిక రంగాల్లో రాణించే విద్యార్థులు చదువుతో పాటు ఉన్నత స్థితికి ఎదుగుతారని మచిలీపట్నం పోర్టు ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దయాసాగర్ అన్నారు.
వైభవంగా ముగిసిన యువజనోత్సవాలు
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 2: సాంస్కృతిక రంగాల్లో రాణించే విద్యార్థులు చదువుతో పాటు ఉన్నత స్థితికి ఎదుగుతారని మచిలీపట్నం పోర్టు ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దయాసాగర్ అన్నారు. శనివారం కృష్ణాతరంగ్ యువజనోత్సవాల ముగింపు సభలో దయాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన పీబీ సిద్ధార్థ కళాశాలకు ట్రోఫీని అందించారు. మొదటి రన్నరప్‌గా నిలిచిన విజయవాడ దుర్గా మల్లేశ్వర మహిళా కళాశాలకు, రెండో రన్నరప్‌గా నిలిచిన విజయవాడ నలందా కళాశాల విద్యార్ధులకు దయాసాగర్, ఉపకులపతి జి.జ్ఞానమణి ట్రోఫీలు అందించారు. ఉపకులపతి జి.జ్ఞానమణి అధ్యక్షోపన్యాసం చేశారు. కృష్ణాతరంగ్‌లో మూడు రోజుల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారన్నారు. శాసనసభ డిప్యూటీ కార్యదర్శి కె.రాజ్‌కుమార్, ఆర్డీవో వాణి, బెరాకా సంస్థ కార్యదర్శి కిరణ్‌పాల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరబ్రహ్మాచారి, కృష్ణాతరంగ్ కన్వీనర్ ఎం.కోటేశ్వరరావు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల ప్రిన్సిపాల్ సుందరకృష్ణ, విజయకుమారి, నవీన లావణ్యలత ప్రసంగించారు. బెరాకా సంస్థ తరఫున కిరణ్‌పాల్ రూ.లక్ష విరాళమందించారు. పీడీ ఎన్.డానియేల్ పాల్గొన్నారు.