పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-06-06T01:10:18+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్‌ రవికుమార్‌, పెనమలూరు సర్పచ్‌ భాస్కరరావు పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా స్థానిక పీహెచ్‌సీలో ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.

 పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పెనమలూరు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటుతున్న డాక్టర్‌ రవికుమార్‌, సర్పంచ్‌ భాస్కరరావు

పెనమలూరు, జూన్‌ 5 : పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్‌ రవికుమార్‌, పెనమలూరు సర్పచ్‌ భాస్కరరావు పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా స్థానిక పీహెచ్‌సీలో ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజాన్ని కాలుష్య కోరల నుంచి కాపాడేది చెట్లేనని, అలాంటి చెట్లను నాటి కాపాడడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. కాలుష్య కారకమైన ప్లాస్టిక్‌ను అందరూ నిషేధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు డివిజన్‌ ప్రోగ్రాం అధికారి సుదర్శన్‌బాబు, మండల పరిషత్‌ ఏవో లోయ శివశంకర్‌, మొక్కల దాత తోకల త్రినాథ్‌, తెన్నేటి ప్రకాష్‌, సిబ్బంది, ఏఎన్‌ఎం పాల్గొన్నారు.

ఫ స్థానిక వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా కానూరు నుంచి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్లకార్డుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ అనేది భూమిలో, సముద్రంలో, అడవుల్లో కాలుష్యానికి ప్రధాన కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు దృష్టి సారించి గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించాలని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కొల్లా నరేంద్ర, ఎకోక్లబ్‌ కో ఆర్డినేటరు డాక్టర్‌ మౌనికలు పర్యవేక్షించారు.

ఉయ్యూరు : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిం చడం బాధ్యతగా గుర్తెరగాలని కేసీపీ చక్కెర కర్మాగార హెడ్‌ వై. సీతారామదాస్‌ అన్నారు. ప్రపంచ పర్యావ రణ దినోత్సవం పురస్కరించుకుని కేసీపీ, రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటారు. ఒక్కసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్ల వాడకా నికి స్వస్తి పలికి గోనె, గుడ్డ సంచులను వాడాలని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లుగా భావించి చెట్లను సంరక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు, సభ్యులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ ్ఞ చేశారు. కార్మిక సంఘ నాయకుడు బాల సుబ్రమణ్యం, రోటరీక్లబ్‌ అధ్యక్షుడు సీహెచ్‌టీ వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటడంతో పాటు పరిరక్షిస్తేనే సత్ఫలితాలు పొదంగలమని రాణా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు సుంకర సాంబశివరాయల్‌ అన్నారు. కానమోలులో సోమవారం ప్రపంచ పర్యా వరణ దినోత్సవ సందర్భంగా విద్యార్ధులతో కలిసి కొబ్బరి, మామిడి మొక్కలు నాటారు. కరోనా సమ యంలో ఆక్సిజన్‌ లేక ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా మోనని గుర్తు చేస్తూ, పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో తాము నాటిన మొక్కల సంరక్షణ కూడా విద్యార్ధులు చేపట్టేలా వారితో కలిసి పండ్ల మొక్కలు నాటామని సాంబశివరాయల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, కానుమోలు యువత సభ్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా భవిష్యత్‌తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ వడ్లమూడి సరోజిని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని తేలప్రోలు, ఆత్కూరు గ్రామాల్లో ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావుతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే వాడి పారవేసే ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథీన్‌ సంచుల వల్ల ప్రకృతికి తీవ్ర హాని కలుగుతోందన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, లేనిపక్షంలో భూమి, నీరు, గాలి ఇలా అన్ని ప్రకృతి వనరులు కాలుష్యకోరల్లో చిక్కి మానవజాతి మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందని హెచ్చరించారు. తేలప్రోలు సర్పంచ్‌ లాం దిబోర, ఆత్కూరు పంచాయతీ కార్యదర్శి జి.సత్యసాయిబాబు, వార్డు సభ్యులు, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-06T01:10:18+05:30 IST