చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ABN , First Publish Date - 2023-11-02T00:18:51+05:30 IST
చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా బుధవారం 52వ డివిజన్ పరిధి బ్రాహ్మణవీధిలో ఉన్న చదును మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
వన్‌టౌన్, నవంబరు1: చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా బుధవారం 52వ డివిజన్ పరిధి బ్రాహ్మణవీధిలో ఉన్న చదును మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి 205 టెంకాయలు కొట్టారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నగరాల సాధికారిక సమితి ఎన్‌టీఆర్ జిల్లా మెంబర్ పోతిన జోగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరుపిళ్ల తిరుమలేష్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజేంద్రకుమార్ జైన్, టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులు పిళ్లా సుదర్శన్, అమానుల్లాఖాన్, సుకాశి సరిత, స్రవంతి, నసీమా, రాధిక, శాంతి, లక్ష్మి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.