Share News

‘సే నో టు డ్రగ్స్‌’ పై చిత్రలేఖనం పోటీలు

ABN , First Publish Date - 2023-11-18T00:43:18+05:30 IST

మాదక ద్రవ్యా ల ప్రభావం బాలలపై పడ కుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నవజీవన్‌ బాలభవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ ఎండీ వసంత కుమారి అన్నారు.

‘సే నో టు డ్రగ్స్‌’ పై చిత్రలేఖనం పోటీలు
విజేతలతో కో-ఆర్డినేటర్‌ వసంతకుమారి

‘సే నో టు డ్రగ్స్‌’ పై చిత్రలేఖనం పోటీలు

పాతరాజరాజేశ్వరి పేట, నవంబరు 17 : మాదక ద్రవ్యా ల ప్రభావం బాలలపై పడ కుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నవజీవన్‌ బాలభవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ ఎండీ వసంత కుమారి అన్నారు. నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా 34వ డివిజన్‌ కేదారేశ్వరపేటలోని రమా పబ్లిక్‌ స్కూల్‌లోని విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంలో వసంత కుమారి మాట్లాడుతూ విద్యార్థులకు ‘‘సే నో టు డ్రగ్స్‌’’ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల అలవాటు దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె. జాస్మిన్‌, సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి జి. వెంకటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు పద్మావతి, అరుణ, ఫాతిమా పాల్గొన్నారు.

Updated Date - 2023-11-18T00:43:20+05:30 IST