ప్రతి ఒక్కరికీ వెన్నుముకపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2023-06-11T00:38:10+05:30 IST
వెన్నుముక గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని ప్రముఖ ఫిజియో థెరపిస్టు సుదీప్తి వర్ధన్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ వెన్నుముకపై
అవగాహన అవసరం
ప్రముఖ ఫిజియోథెరపిస్టు సుదీప్తి వర్ధన్
పటమట, జూన్ 10 : వెన్నుముక గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని ప్రముఖ ఫిజియో థెరపిస్టు సుదీప్తి వర్ధన్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ సమరం అధ్యక్ష తన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె వెన్నుముక సంబంధిత జీవన శైలి మార్పులు అనే అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ సరైన విధంగా కూర్చోవడం, నిలబడటం లేనప్పుడు నడుంనొప్పి, తుంటి కీలు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి రావడమే కాకుండా కడుపులో మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. సరైన పొజిషన్‌లో కూర్చోవడం, నుంచోవడంపై అవగాహన ఉండటమే కాకుండా అటువంటి బాధలు వచ్చిన వాళ్లు దానికి తగిన వ్యాయామాలు ఎలా చేస్తే ఉపశాంతి వస్తుందో తెలుసుకో వాలన్నారు. నడుంనొప్పి వస్తే వెన్నుపూసల్లోనో, డిస్క్‌లోనో లోపం ఉందని అనుకోవడం సరికాదన్నారు. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే జీవితం సుఖవంతంగా ఉంటుందని అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు.