నగరంలో తైక్వాండో జాతీయ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:08 AM
నగరంలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య వీఎంసీ ఇండోర్ స్టేడియంలో 38వ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభం అయ్యాయి.
నగరంలో తైక్వాండో జాతీయ పోటీలు ప్రారంభం
విజయవాడ స్పోర్ట్సు, డిసెంబరు 22 : నగరంలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య వీఎంసీ ఇండోర్ స్టేడియంలో 38వ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను విజయవాడ సెకండ్ మెట్రోపాలిటన్ సీనియర్ జడ్జి ఏబీ.అప్పారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గౌరవ అతిథిగా తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బీ.రమణయ్య, టెక్నికల్ కమిటీ సభ్యులు ఎండీ. హఫీజ్, పి.కతిరవణ్, బి.బాల మురళీకృష్ణలు పాల్గొన్నారు. 13 రాష్ర్టాల నుంచి 300 మంది తైక్వాండో క్రీడాకారులు బరిలో దిగారని ఏపీ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డీవీవీ.ప్రసాద్ తెలిపారు.