చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2023-03-07T00:43:46+05:30 IST
ప్రతీ ఒక్కరూ చట్టలపైన అవగాహన కలిగి ఉండాలని 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజారామ్ అన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి రాజారామ్
సత్యనారాయణపురం, మార్చి 6 : ప్రతీ ఒక్కరూ చట్టలపైన అవగాహన కలిగి ఉండాలని 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజారామ్ అన్నారు. ముత్యాలంపాడు అజయ్ పాఠశాలలో మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు ఉన్నాయని చెప్పారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలు ఉచితంగా న్యాయసలహాలు పొందవచ్చునన్నారు. విద్యార్థులు లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అలా చేయడం చట్ట ప్రకారం నేరం అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. న్యాయవాది పగిడి పల్లి రాము, కె.ఎస్.జయకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏపుగంటి లక్ష్మీ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.