Share News

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:22 AM

మత్స్యకారుల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబుతో కలిసి నడకుదురులో రూ.9.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎంపీ ప్రారంభించారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

చల్లపల్లి, డిసెంబరు 16 : మత్స్యకారుల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబుతో కలిసి నడకుదురులో రూ.9.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎంపీ ప్రారంభించారు. రూ.15 లక్షలతో మత్స్యకార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బందరు పార్లమెంటు పరిధిలో రూ.10 కోట్లతో అన్ని వర్గాల వారికీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార యువత డీప్‌ సీలోకి వెళ్లి మత్స్యసంపద తెచ్చి లాభాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ. ఐదు కోట్ల సీఎ్‌సఆర్‌ నిధులతో జెట్టీల నిర్మాణం, వలలు మంజూరు, మత్స్యసంపద ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. సర్పంచ్‌ గొరిపర్తి సురే్‌షబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో సిహెచ్‌.చినరాట్నాలు, పీఆర్‌ డీఈ బండారు వెంకటేశ్వరరావు, ఏఈ బొప్పన వెంకటేశ్వరరావు, వైసీపీ కన్వీనర్‌ శీరం నాని, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ ఛైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు.

వంతెన నిర్మాణం శిలాఫలకం ఆవిష్కరణ

నాగాయలంక : బర్రంకుల - గణపేశ్వరం గ్రామాల మధ్య మంగలేరు మీడియం డ్రెయిన్‌పై ఎంపీ లాడ్స్‌ నిధులు రూ.80 లక్షలతో నూతనంగా నిర్మించే వంతెన శిలాఫలకాన్ని శనివారం ఎంపీ వల్లభనేని బాలశౌరి బర్రంకులలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, జడ్పీటీసీ మోకా బుచ్చిబాబు, తహసీల్దార్‌ జె.విమలకుమారి, ఎంపీడీవో సిహెచ్‌.శ్రీనివాసరావు, భోగాది శేషగిరిరావు, బర్మా రాంబాబు, బెల్లంకొండ శ్రీనివాసరావు, దాసి జీవరత్నం, తోట సాయిబాబు, బీసాబత్తిన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:48 AM