సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బంగారు ఆభరణాలు
ABN , First Publish Date - 2023-08-09T01:43:01+05:30 IST
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి చీరాల గ్రామానికి చెందిన ఎం.నాగేశ్వరరావు - అనిత దంపతులు 15 గ్రాముల 980 మిల్లిగ్రాముల బంగారపు ఆభరణాలను సమర్పించారు
మోపిదేవి, ఆగస్టు 8 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి చీరాల గ్రామానికి చెందిన ఎం.నాగేశ్వరరావు - అనిత దంపతులు 15 గ్రాముల 980 మిల్లిగ్రాముల బంగారపు ఆభరణాలను సమర్పించారు కుటుంబ సమేతంగా మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. బంగారపు సూత్రాలు నాలుగు, నానుకోళ్లు రెండు ఆలయ ఈవో ఎన్.ఎ్‌స.చక్రధరరావుకు అందజేశారు. దాతలకు స్వామివారి ప్రసాదాలు అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.