మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళి

ABN , First Publish Date - 2023-09-16T00:44:37+05:30 IST

మిక్‌, అమ్రిత సాయి ఇంజనీరింగ్‌ కళాశాల్లో శుక్రవారం ఇంజనీర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. మిక్‌లో తొలుత ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళి
అమ్రితసాయి కళాశాలలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ప్రిన్సిపాల్‌ శశిధర్‌

కంచికచర్ల, సెప్టెంబరు 15 : మిక్‌, అమ్రిత సాయి ఇంజనీరింగ్‌ కళాశాల్లో శుక్రవారం ఇంజనీర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. మిక్‌లో తొలుత ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు పోటాపోటీగా పలు నమూనా (వర్కింగ్‌ మోడల్స్‌) లు తయారుచేసి ప్రదర్శించారు. రోబోటిక్స్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. అమ్రితసాయిలో విద్యార్థులు సృజనాత్మకతను మేళవించి, పలు ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈసీఈ విద్యార్థులకు ఐఈటీఈ స్టూడెంట్‌ ఫోరమ్‌ను ప్రారంభించారు. కళాశాల కరస్పాండెంట్‌ కె.రామ్మోహనరావు మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. భారతరత్న విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యాప్‌ డెవలప్‌మెంట్‌, రోబోటిక్స్‌, హార్డ్‌వేర్‌ నమూనాలు, వర్కింగ్‌ మోడల్స్‌లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

Updated Date - 2023-09-16T00:44:37+05:30 IST