వైసీపీ అహంకారానికి ఎమ్మెల్సీ ఫలితాలు చెంపపెట్టు

ABN , First Publish Date - 2023-03-19T00:05:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అహంకారానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం చెంపపెట్టు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

వైసీపీ అహంకారానికి ఎమ్మెల్సీ ఫలితాలు చెంపపెట్టు
జగ్గయ్యపేటలో మోటారుసైకిల్‌ ర్యాలీ

ఇబ్రహీంపట్నం, మార్చి 18: వైసీపీ ప్రభుత్వ అహంకారానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం చెంపపెట్టు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధిం చటంపై పార్టీ కార్యాలయంలో బాణసంచాల కాల్చి సంబరాలు జరిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగంను ప్రభుత్వ ఆదుకోవాలన్నారు. టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్‌రెడ్డి పాలనకు రిఫరెండమ్‌గా నిలిచాయని మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య అన్నారు. పట్టణంలో శనివారం విజయో త్సవాలు నిర్వహించారు. బంగారపు కొట్ల సెంటర్‌లో గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్సి, స్వీట్లు పంచారు. మాజీ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, నూకల కుమార్‌రాజా, కె.సత్యనారాయణప్రసాద్‌, కన్నెబోయిన రామలక్ష్మి, కౌన్సిలర్లు కె.గీతారాణి, పున్నా ఉపేంద్ర, తుమ్మల చైతన్య, చిలుకూరి కార్తీర్‌, మద్దుల ఉమా, కారుపాటి వినోద్‌, సుభాని పాల్గొన్నారు.

జగ్గయ్యపేట రూరల్‌ : టీడీపీ గ్రీవెన్స్‌ సెల్‌ కో-కన్వీనర్‌ ముల్లంగి రామకృష్ణారెడ్డి మట్లాడుతూ ఈ ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. యువత ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.

Updated Date - 2023-03-19T00:05:14+05:30 IST