పాల ధర పెంపు అన్యాయం
ABN , First Publish Date - 2023-03-02T00:57:19+05:30 IST
ఏడాదిలో మూడు సార్లు పాల ధరల పెంపు అన్యాయమని, పెంచిన ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూ రావు డిమాండ్ చేశారు.
వెంటనే ధర తగ్గించాలని సీపీఎం, సీపీఐ డిమాండ్
పాలఫ్యాక్టరీ ఎదుట వేర్వేరుగా ఆందోళన
చిట్టినగర్, మార్చి 1: ఏడాదిలో మూడు సార్లు పాల ధరల పెంపు అన్యాయమని, పెంచిన ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూ రావు డిమాండ్ చేశారు. పాలధర పెంపును నిరసిస్తూ పాల ఫ్యాక్టరీ ఎదుట సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం వేర్వేరుగా ఆందోళన చేశారు. ధరల అదుపులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీహెచ్ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాల ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని మోపారని, దీంతో ఏడాదిలో మూడుసార్లు పాల ధర పెంచారని అన్నారు. గుజరాత్ బడా సంస్థ అమూల్‌పై వల్లమాలిన ప్రేమ చూపు తూ స్థానిక పాల సహకార సంఘాలను నిర్వీ ర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పాల ధరలు పెంచి భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులతో చర్చించకుండా కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్ భారాలు మోపుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తోం దన్నారు. పాడి రైతులకు ఇస్తానన్న రాయితీ నాలుగు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వా లని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే పెంచిన పాల ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం పాల ఉత్ప త్తులపై జీఎస్టీని రద్దు చేయాలని సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, కార్పొరేటర్ బోయి సత్యబాబు, బి.రమణ, కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ధర తగ్గించకుంటే ఉద్యమం ఉధృతం: సీపీఐ
పెంచిన పాల ధరలు తక్షణమే ఉప సం హరించుకోవాలని పాల ఫ్యాక్టరీ వద్ద ఆందోళనలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఖర్చులు పెంచడం, జీఎస్టీలు విధించడం కారణంగా పాల ఉత్తత్తిపై భారం పెరిగిందని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. ఏడాదిలో పాలధరను ఆరు రూపా యలు పెంచారని, రాబోయే రోజుల్లో సామా న్యులు పాలు కొనుగోలు చేయాలేని స్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పాల ధరలను తగ్గించి సామాన్యులకు అందు బాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కేవీ భాస్కర్‌రావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.