మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2023-05-28T01:00:18+05:30 IST

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగువారి పసుపు పండుగ జరుగుతున్న రాజమండ్రి మహానాడు కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. గతంలో ఒంగోలులో జరిగిన మహానాడుకు దీటుగా కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్లు
మహానాడులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో శంకరబాబు, ప్రభాకరరావు

పెనమలూరు, మే 27 : అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగువారి పసుపు పండుగ జరుగుతున్న రాజమండ్రి మహానాడు కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. గతంలో ఒంగోలులో జరిగిన మహానాడుకు దీటుగా కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెనమలూరు నుంచి నేటి మహానాడు కార్యక్రమానికి ఇంకా ఎక్కువ మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, సానుభూతిపరులు తరలివెళ్లనున్నట్లు తెలుస్తోంది. హనుమాన్‌జంక్షన్‌ : రాజమండ్రిలో జరు గుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి బాపులపాడు మండలం నుంచి నాయకులు తరలివెళ్లారు. మండల అఽధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు నాయకత్వంలో శనివారం దా దాపు 60 మంది నాయకులు ప్రతినిధులు గా హాజరైనట్లు రాజేశ్వరరావు తెలిపారు. మహా నాడు నూతనోత్సహాన్ని నింపిందని నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ మహా నాడుకు ప్రధాన ఆకర్షణగా నిలిచి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తీసుకు వచ్చారని రాజేశ్వరరావు పేర్కొన్నారు. నాయకులు చిరుమామిళ్ల సూర్యం, పుట్టా సురేష్‌, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమావర ప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, మూల్పూరి సాయికల్యాణి, మొవ్వా వెంకటేశ్వరరావు, గండేపూడి నితీష్‌కుమార్‌, మజ్జిగ నాగరాజు, కొండపల్లి వెంకటేశ్వరరావు, మండాది రవీంద్ర, వాసు, మాదాల శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు హాజరైన వారిలో ఉన్నారు.

Updated Date - 2023-05-28T01:00:18+05:30 IST