వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-09-04T00:32:56+05:30 IST
సిజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎం.సుహాసిని ఆదేశించారు.
తిరువూరు, సెప్టెంబరు 3: సిజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎం.సుహాసిని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు. అధికారులతో చర్చించి దోమలనివారణ మందు పిచికారి చేయించాలన్నారు. ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆమె సందర్శించారు. నియోజకవర్గం పరిధిలో జ్వరంతో బాధపడుతున్న వివిధ గ్రామాలకు చెందిన 11మంది ఆమె పరామర్శించారు. వీరికి సీజన్ జ్వరాలేనని, డెంగ్యూ, మలేరీయా లేదన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా మలేరియా అధికారి మెహిబాబు, ఆసుపత్రి సూపరింటెండెండ్ గార్గేయ, సీహెచ్‌సీల వైద్యధికారులు కళ్యాణ్‌చక్రవర్తి, నర్సింహనాయక్ పాల్గొన్నారు.