జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా మానేపల్లి

ABN , First Publish Date - 2023-09-22T01:39:11+05:30 IST

ట్టు ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను చెప్పారు. ఏఎంసీ చైర్మన్‌ ముత్తినేని విజయశేఖర్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో ఆయనస్థానంలో మానేపల్లిని ఖరారు చేశారు.

జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా మానేపల్లి

జగ్గయ్యపేట, సెప్టెంబరు 21 : జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్‌గా వైస్‌చైర్మన్‌ మానేపల్లి నాగబ్రహ్మంను నియమించినట్టు ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను చెప్పారు. ఏఎంసీ చైర్మన్‌ ముత్తినేని విజయశేఖర్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో ఆయనస్థానంలో మానేపల్లిని ఖరారు చేశారు. ఏఎంసీలో జరిగిన కార్యక్రమంలో ఉదయభాను మాట్లాడుతూ, పాలకవర్గం చిల్లకల్లు సంతపై దృష్టి సారించి ఆదాయం పెంచాలన్నారు. సంతలో గేదేల అమ్మకాలను ప్రారంభించాలని, రైతు విశ్రాంతి భవనాన్ని అభివృద్ధి చేయాలని నూతన చైర్మన్‌ మానేపల్లిని ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయభానును ఏఎంసీ పాలకవర్గం చైర్మన్‌ నాగబ్రహ్మం ఆధ్వర్యంలో సత్కరించింది. తన్నీరు నాగేశ్వరరావు, ఆకుల శ్రీకాంత్‌, నంబూరి రవి, అల్లూరి రవి, తుమ్మేపల్లి నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T01:39:11+05:30 IST