రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2023-06-11T00:36:14+05:30 IST

మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారిపై కనుమూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

పామర్రు, జూన్‌ 10: మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారిపై కనుమూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మచిలీపట్నం నుంచి బైక్‌పై విజయవాడ వెళ్తున్న లంకే శ్రీను (40) ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో శ్రీను రోడ్డుపై పడ్డాడు. రోడ్డును బలంగా తాకడంతో అక్కడిక్కడే మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. మృతుడు విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతని కుటుంబసభ్యులకు ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి సమాచారమిచ్చారు.

Updated Date - 2023-06-11T00:36:14+05:30 IST