లోక రక్షకుడు ఏసుక్రీస్తు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:27 AM
లోక రక్షకుడు ఏసుక్రీస్తు చూపిన మార్గం ప్రపంచానికే అనుసరణీ యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ ఉడా కాలనీలోని కృపా మినిస్ట్రీస్ చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన లు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పాయకాపురం, డిసెంబరు 25 : లోక రక్షకుడు ఏసుక్రీస్తు చూపిన మార్గం ప్రపంచానికే అనుసరణీ యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ ఉడా కాలనీలోని కృపా మినిస్ట్రీస్ చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన లు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నా లేకున్నా గత 15 ఏళ్లుగా నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ప్రతి డివిజన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అడుగడుగునా క్రిస్మస్ పాకలు, తోరణాలు
పాతరాజరాజేశ్వరి పేట : క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూర్ణానందంపేట, బాప్టిస్ట్ పాలెం, పెజ్జోనిపేట, ఆర్ట్‌పేట, కేదారేశ్వరపేట, ఖుద్ధూస్ నగర్, పాతరాజరాజేశ్వరి పేట, వించిపేట ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని ఇచ్చారు. పశువుల పాకలు ఆకర్షణీయంగా నిలిచాయి.
దేవుడు మాన వుడిగా భువికి వచ్చిన రోజు..
వన్‌టౌన్: క్మిస్మస్ సందర్బంగా వన్‌టౌన్‌లోని సెయింట్ పీటర్స్ కో కథెడ్రల్‌లో సోమవారం క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. విచారణ కర్త ఫాధర్ దామల విజయకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సందేశమిచ్చారు. క్రీస్తు త్యాగనిరతిని క్రైస్తవులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరుణ, జాలి, దయలను కేంద్రబిందువులుగా తీసుకున్న క్రీస్తు మానవాళికి మహోపకారం చేశాడన్నారు. రీజియనల్ సుపీరియర్ ఫాదర్ జోరిమల్ల బాలస్వామి, ఫాదర్ క్రీస్తురాజు సమిష్టి దివ్యపూజా బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ కేకు కట్ చేశారు బాలయేసు పశువుల పాక వంటి అకృతులు ఆకట్టుకున్నాయి.