ప్రజలకు మరింత చేరువగా ఎల్‌ఐసీ సేవలు
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:32 AM
ఎల్‌ఐసీ సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్‌బాబు అన్నారు.
బంటుమిల్లి : ఎల్‌ఐసీ సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్‌బాబు అన్నారు. అర్తమూరు మణిమేశ్వరం రోడ్, బంటుమిల్లి రామాలయం కాంప్లెక్స్, సంతమార్కెట్ రోడ్, జానాకిరామాపురం ప్రాంతాల్లో పాలసీదారులకు సేవా కేంద్రాలు, ప్రీమియం వసూలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ క్యాలెండర్ ఆవిష్కరించారు. జీవన్ ఉత్సవ్ పాలసీ ప్రయోనాలను వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ శివనాగప్రసాద్, సేల్స్ మేనేజర్స్ శివప్రసాద్, శివశ్రీ, మచిలీపట్నం బ్రాంచి-2 సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు, దిలీ్‌పకుమార్, నాగరాజ్ కుమార్, సన్నాల రఘు, విఠల్, గ్రామ ప్రముఖులు సుజ్ఞానం మహేష్, సతీష్, కొమ్మారెడ్డి కిషోర్, సుగుణ్‌కుమార్, చిన్నా, లీలాకృష్ణ, కందుల నాగేశ్వరరావు, కంఠమనేని మురళీ, వీరబాబు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, జనార్దన్, అజయ్‌ఘోష్, శివప్రసాద్, ముత్యాల నాగేశ్వరరావు, సుబ్రమణ్యం, ఆంజనేయులు, అంజిబాబు పాల్గొన్నారు. ఎస్‌డీఎం, ఇతర అధికారు లను గ్రామ ప్రముఖులు సత్కరించారు.