ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర తేల్చుకుందాం

ABN , First Publish Date - 2023-02-21T01:23:26+05:30 IST

‘‘మనుషులు లేకుండా పార్టీ కార్యాలయాలపై దాడు లు చేయడం, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం మగతనం కాదు. దమ్ముంటే టైం మీరే చెప్పండి. విజయవాడ పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద పోలీసులు లేకుండా ఫేస్‌ టు ఫేస్‌ తేల్చుకుం దాం. అక్కడే కొట్టుకుందాం. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తేలిపోతుంది’’ అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు టీడీపీ నేతలు సవాలు విసిరారు.

ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర తేల్చుకుందాం

టైం మీరే చెప్పండి

వ్యక్తిగత దూషణలు, దాడులు మగతనమా?

వంశీ, నాని, అవినాష్‌లది చంద్రబాబు ఇచ్చిన పర్సనాలిటీ

వాళ్ల డీఎన్‌ఏ ఎవరిది

దాడులు, దూషణలు చేసిన వారికి 4+4 గన్‌మెన్లా?: టీడీపీ నేతలు

విజయవాడ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘‘మనుషులు లేకుండా పార్టీ కార్యాలయాలపై దాడు లు చేయడం, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం మగతనం కాదు. దమ్ముంటే టైం మీరే చెప్పండి. విజయవాడ పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద పోలీసులు లేకుండా ఫేస్‌ టు ఫేస్‌ తేల్చుకుం దాం. అక్కడే కొట్టుకుందాం. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తేలిపోతుంది’’ అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు టీడీపీ నేతలు సవాలు విసిరారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామ య్య, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాజ్‌భవన్‌లో గవర్నరు హరిచందన్‌ను సోమవారం కలిశాక రాజ్‌భవన్‌ బయట మీడియాతో వారు మాట్లాడారు.

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉందా?: కొనకళ్ల

నోరు అదుపులో పెట్టుకోవాలని వంశీని పలు మార్లు హెచ్చరించామని, రాజకీయం, రౌడీయిజం వేర్వేరు అని కొనకళ్ల నారాయణ అన్నారు. రాజకీ యాల్లో వంశీ వంటి రౌడీలు ఉండడం దౌర్భాగ్య కరమన్నారు. వంశీ తన అనుచరులను టీడీపీ కార్యాలయానికి పంపి పట్టపగలు దాడులు చేయి స్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అని ఆయన ప్రశ్నించారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తే దేశంలో అరాచకం పెరుగుతుందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు చావుబతుకుల మధ్య ఉన్న ప్పుడు ఇలాంటి దాడులు చేయడం ఎంత వరకు సబబు అని కొనకళ్ల ప్రశ్నించారు.

వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్‌.. పకోడీగాళ్లు: బుద్దా వెంకన్న

వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్‌లు ఉల్లిపాయ పకోడీగాళ్లని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. పదేపదే తమది ఎన్టీఆర్‌ డీఎన్‌ఏ అని చెప్పుకుంటున్న వాళ్ల డీఎన్‌ఏ ఏమిటని ప్రశ్నించారు. ఈ ముగ్గురికి ఒక పర్సనాలిటీ వచ్చిందంటే దానికి చంద్రబాబు వారికి బీఫారాలు ఇవ్వడమే కారణమన్నారు. ఎన్టీఆర్‌కు వారసులమని చెప్పుకొంటున్న ఈ ముగ్గురు విజ యవాడ పటమట ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వస్తే ఎవరు ఏమిటో తేల్చుకుందామని సవాలు విసి రారు. పోలీసులు, గన్‌మన్లను పక్కన పెట్టి వస్తే కొట్టుకుందామన్నారు. ఆ తర్వాత ఎవరు ఉం టారో, ఎవరు వెళ్లిపోతారో తేలిపోతుందన్నారు. ఎవరూ లేనప్పుడు పార్టీ కార్యాలయాలపై దాడులు, ప్రతిపక్ష పార్టీ నేతల కుటుంబ సభ్యులను దూషిం చడం మగతనం కాదన్నారు. అందరం కలిసి ఒక డిబేట్‌ పెట్టుకుందామని సవాలు విసిరారు. చంద్ర బాబు లేకపోతే వంశీ, నాని, అవినాష్‌ పేర్లు విజయ వాడలో ఎవరికీ తెలియవన్నారు. ఈ ముగ్గురు ఏ కారణంగా పార్టీ మారారో ఇక నుంచి ఆధారాలతో వివరిస్తానని వెల్లడించారు. ఈ ముగ్గురికి అంతిమ ఘడియలు మొదలయ్యాయని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించిన వారికి 4+4 గన్‌మన్లు, పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన అవినాష్‌కు 2+2 గన్‌మన్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాజకీయ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. తమకు ధైర్యం ఉంది కాబట్టి ఎలాంటి భద్రత లేకుండా ప్రజల్లో తిరుగుతున్నామన్నారు. వారికి శరీరం నిండా భయం ఉంది కాబట్టి గన్‌మన్లతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-02-21T01:23:28+05:30 IST