సమన్వయంతో అభివృద్ధి చేసుకుందాం

ABN , First Publish Date - 2023-05-26T00:44:47+05:30 IST

అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతిని ధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కోటేరు లక్ష్మి అన్నారు.

సమన్వయంతో అభివృద్ధి చేసుకుందాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మి

వీరులపాడు, మే 25: అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతిని ధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కోటేరు లక్ష్మి అన్నారు. వెలుగు కార్యాలయంలో గురువారం జరిగిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు సవ్యంగా సాగాలంటే శాఖల మధ్య సమన్వ యం అవసరమన్నారు. ఎంపీడీవో అరుంధతిదేవి, పంచాయతీరాజ్‌ డీఈఈ శ్రీనివాస్‌, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:44:47+05:30 IST