భూముల రీసర్వేపై తహసీల్దార్ సమీక్ష
ABN , First Publish Date - 2023-03-19T00:30:30+05:30 IST
ప్రభుత్వం కొత్తగా నిర్వహించ తలపెట్టిన రీసర్వేపై రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ టీవీ సతీష్ శనివారం సమీక్ష జరిపారు.

పెనమలూరు, మార్చి 18 : ప్రభుత్వం కొత్తగా నిర్వహించ తలపెట్టిన రీసర్వేపై రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ టీవీ సతీష్ శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఆర్వోలు, సర్వేయర్లు తమ పరిఽధిలోని గ్రామాల్లో ప్రతి సర్వే నంబరు పరిశీలించి అందున్న రైతుల వద్ద వారి అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవాలని, వాటిని అనుసంధానించి, రీసర్వేలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని కోరారు. కోర్టు కేసులకు సంబంధించి విచారణ నివేదికలు త్వరగా కార్యాలయం నందు నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీనివాసరావు, రీసర్వే డీటీ అనిల్, సర్వేయరు శివరామకృష్ణ, ఆర్‌ఐ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.