సీఎం నా బామ్మర్ది
ABN , First Publish Date - 2023-06-07T23:47:47+05:30 IST
‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నా బామ్మర్ది. గతంలో అరిపిరాలలో చెరువు తవ్వా. ఎవ్వడు ఆపలా! ఇప్పుడు చినలింగాలలో తవ్వుతున్నా. ఆపేదెవ్వడు?’ అంటూ నందివాడ మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నాడు. మండలంలో ఈయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. ఫోన్ వచ్చినా, సదరు వ్యక్తి పేరెత్తినా రెవెన్యూ అధికారులే కాదు ఏ శాఖ అధికారులైన బెంబెలెత్తిపోతున్నారు. ఆ స్థాయిలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. మాట వినకపోతే దాడులు చేయించడం ఈయన ప్రత్యేకత.
ఎలా ఆపుతారో చూస్తా
వైసీపీ సర్పంచి దౌర్జన్యం
మరో ఇద్దరితో కలిసి చినలింగాలలో చెరువు అక్రమ తవ్వకం
చర్యలకు భయపడుతున్న అధికారులు
‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నా బామ్మర్ది. గతంలో అరిపిరాలలో చెరువు తవ్వా. ఎవ్వడు ఆపలా! ఇప్పుడు చినలింగాలలో తవ్వుతున్నా. ఆపేదెవ్వడు?’ అంటూ నందివాడ మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నాడు. మండలంలో ఈయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. ఫోన్ వచ్చినా, సదరు వ్యక్తి పేరెత్తినా రెవెన్యూ అధికారులే కాదు ఏ శాఖ అధికారులైన బెంబెలెత్తిపోతున్నారు. ఆ స్థాయిలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. మాట వినకపోతే దాడులు చేయించడం ఈయన ప్రత్యేకత.
గుడివాడ : వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో ఏపీ సడా చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం చెరువు తవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం లైసెన్స్ పొందాల్సి ఉంది. కానీ చట్టాలు అధికార పార్టీ నాయ కులకు చుట్టాలయ్యాయి. నందివాడ మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్, మాజీ సర్పంచ్, ప్రస్తుత ప్రజాప్రతినిధి భర్త.. ముగ్గురు కలిసి చినలింగాల గ్రామ రెవెన్యూ పరిధిలో 30 ఎకరాల్లో అక్రమంగా చెరువు తవ్వకానికి తెరలేపారు. 2013లో అప్పటి డీఎల్‌సీలో చినలింగాలలో తమకు చెరువు తవ్వకానికి అనుమతులు ఉన్నాయంటూ 5 రోజులుగా యథేచ్ఛగా చెరువు తవ్వకం ప్రారంభించారు. అధికార పార్టీ నాయకులు కావడంతో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రశ్నించే ధైర్యం రెవెన్యూ వర్గాలకు గానీ, ఫిషరీస్ శాఖకు గానీ లేదు. ప్రస్తుతం ఏపీ సడా చట్టం ప్రకారం చెరువు తవ్వకానికి ఎటువంటి అనుమతులూ లేవు. అయినా యథేచ్ఛగా చెరువును తవ్వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతో బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు గమ్మునున్నారు. అక్రమంగా చెరువు తవ్వుతున్న విషయం మీడియా దృష్టికి రావడంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులు తవ్వకాన్ని నిలుపుదల చేశారు. అక్రమంపై వివరణ కోసం వీఆర్‌వోను ఫోన్‌లో సంప్రదించగా లిఫ్ట్ చేయలేదు. తరువాత కాసేపటికి స్విచ్ఛాఫ్ చేశారు.
చెరువు తవ్వకాన్ని నిలిపేశాం
ఎటువంటి అనుమతులు లేకుండా చెరువు తవ్వుతున్నట్టు తమ దృష్టికి వచ్చింది. దీంతో తవ్వకాన్ని నిలుపుదల చేశాం. వీఆర్‌ఏను చెరువు తవ్వకం ప్రాంతంలో గస్తీకి పెట్టాం. - భావన్నారాయణ, తహసీల్దార్
ఎటువంటి అనుమతులూ లేవు
చినలింగాలలో తవ్వుతున్న చెరువుకు ఏపీ సడా 2020 చట్టం ప్రకారం ఎటువంటి అనుమతులూ లేవు. అక్రమంగా చెరువు తవ్వుతున్న వారిపై శాఖాపర్యమైన చర్యలు చేపడతాం.
- రవికుమార్, ఎఫ్‌డీవో