పల్నాడులో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసంపై లక్ష్మీపార్వతి స్పందించాలి

ABN , First Publish Date - 2023-03-02T01:00:20+05:30 IST

ప్రతి విషయాన్ని రాజకీయం చేసే వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఎందుకు స్పందించలేదని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌ ప్రశ్నించారు.

పల్నాడులో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసంపై లక్ష్మీపార్వతి స్పందించాలి

టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌

పాయకాపురం, మార్చి 1: ప్రతి విషయాన్ని రాజకీయం చేసే వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఎందుకు స్పందించలేదని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌ ప్రశ్నించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఘంటావారి పాలెంలో దుండగులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. వైసీపీ ప్రభుత్వంలో మహనీయులను అవమానించడం పరి పాటిగా మారిందన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తారకరత్న మరణాన్ని కూడా లక్ష్మీపార్వతి రాజకీయం చేశారని, ఎన్టీఆర్‌ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చినా లక్ష్మీపార్వతి ఎందుకు స్పందించలేదని పరుచూరి ప్రసాద్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-02T01:00:20+05:30 IST