చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరం
ABN , First Publish Date - 2023-07-17T01:04:48+05:30 IST
టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు.
మచిలీపట్నం టౌన్, జూలై 16 : టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు. మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించిన భవిష్యత్‌కు గ్యారంటీ, చైతన్యరథ బస్సు యాత్ర సందర్భంగా ఆదివారం రాత్రి కోనేరు సెంటరులో జరిగిన సభలో కోనేరుసెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించగా, మా జీ ఉపసభాపతులు మండలి బుద్ధప్రసాద్, వేదవ్యాస్, మాజీ మం త్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యేలు రావి, బోడె ప్రసాద్, పెడన్ ఇన్‌చార్జి కాగిత, పామర్రు ఇన్‌చార్జి కుమార్‌రాజా, టీడీపీ నేత వెనిగండ్ల రాము పాల్గొని టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. రవీంద్ర మాట్లాడుతూ, ఎమ్మెల్యే పేర్ని నాని హయాంలో మచిలీపట్నంలో అక్రమంగా టీడీపీ నాయకులపైన, బడుగు బలహీన వర్గాల వారిపైన కేసులు పెడుతున్నారన్నాని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఎస్సీ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎమ్మెల్యే పేర్ని నాని పట్టించుకోవడం లేదన్నా రు. ఎన్.గొల్లపాలెంలో ఎస్సీ భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పగా కూలిపోయాయన్నారు. అవినీతి అక్రమాల్లో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ, జగన్‌రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు. మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాల్లో రోడ్లకు మరమ్మతులు లేకుండా పోయాయన్నారు. డ్రెయిన్లు పంట కాలువలకు మరమ్మతులు లేకపోవడం వల్ల పంటలు ముంపునకు గురయ్యాయన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఏనాడూ కృష్ణానదిలో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోవడం చూడలేదన్నారు. పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఎస్సీ, బీసీ వర్గాలు అణచివేతకు గురవుతున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం
బందరులోని రూరల్ గ్రామాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ స్పందన లభించింది. తాళ్లపాలెంలో ప్రారంభమైన యాత్ర డాబాల సెంటర్, పోతిరెడ్డిపాలెం, పోతేపల్లి, జిల్లా పరిషత్, లక్ష్మీటాకీసు, బైపా్‌సరోడ్డు, హౌసింగ్ బోర్డు, మందుల గూడెం, మూడుస్తంభాల సెంటర్, గో సంఘం, శారదానగర్, చింతచెట్టు, రాజుపేట, జవ్వారుపేట, నాయర్‌బడ్డీ, పోలీసు కళ్యాణ మండపం మీదుగా కోనేరుసెంటర్‌కు చేరుకుంది. చైతన్యరథం ర్యాలీలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, సంపదను సృష్టించి సంక్షేమాన్నిచ్చే చంద్రబాబును ఆదరించాలని కోరారు. మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలో దాదాపు రూ. 1800 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టును 74 శాతం చంద్రబాబు పూర్తి చేశారన్నారు. జగన్‌రెడ్డి పోలవరాన్ని మూలన పడేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, బోడె ప్రసాద్, పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కాగిత గోపాలరావు, తలారి సోమశేఖర్, సనకా నాగులు, లంకే హరికృష్ణ, అక్కుమహంతి రాజా, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరా ము, మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, నాయకులు ఎండి ఇలియాస్ పాషా, బత్తిన దాసు, హసీంబేగ్, లంకిశెట్టి నీరజ, వాలిశెట్టి హైమావతి, బచ్చుల అనిల్‌కుమార్, వాలిశెట్టి తిరుమలరావు, కుంచే నాని, గుమ్మడి విద్యాసాగర్ పాల్గొన్నారు.