కనకదుర్గమ్మకు కాసులపేరు

ABN , First Publish Date - 2023-02-07T01:27:40+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)కు చెందిన నారెళ్ల సుధారాణి కుటుంబ సభ్యులు 178 గ్రాముల బంగారు కాసుల పేరును, విజయవాడకు చెందిన చెన్నుపాటి కోటేశ్వరమ్మ 41 గ్రాము ల తామరపువ్వును బహూకరించారు.

కనకదుర్గమ్మకు కాసులపేరు
ఈఈ కోటేశ్వరరావుకు కాసుల పేరును అందజేస్తున్న సుధారాణి కుటుంబసభ్యులు

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 6: ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)కు చెందిన నారెళ్ల సుధారాణి కుటుంబ సభ్యులు 178 గ్రాముల బంగారు కాసుల పేరును, విజయవాడకు చెందిన చెన్నుపాటి కోటేశ్వరమ్మ 41 గ్రాము ల తామరపువ్వును బహూకరించారు. అమ్మవారిని దర్శించు కున్న అనంతరం ఈఈ కేవీఎస్‌ కోటేశ్వరరావు ద్వారా దేవస్థానానికి కానుకగా అందించారు. అర్చకులు వారికి శేషవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు.

Updated Date - 2023-02-07T01:27:41+05:30 IST