కాపునేస్తం హుష్‌!

ABN , First Publish Date - 2023-09-20T01:21:12+05:30 IST

పలువురు వలంటీర్లు, అధికారుల నిర్లక్ష్యంతో అనేక మంది మహిళలకు కాపు నేస్తం నిధులు తమ ఖాతాల్లో జమకాలేదని గగ్గోలు పెడుతున్నారు.

కాపునేస్తం హుష్‌!

కృష్ణలంక: పలువురు వలంటీర్లు, అధికారుల నిర్లక్ష్యంతో అనేక మంది మహిళలకు కాపు నేస్తం నిధులు తమ ఖాతాల్లో జమకాలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా కాపునేస్తం నిధులు తీసుకొంటున్నవారు, గతంలో ఎంఆర్‌వో ఇచ్చిన కుల ధ్రువీకరణ, ఇన్‌కం సర్టిఫికెట్లు పనికారావని, సచివాలయం ద్వా రానే పొందాలని కొత్త నిబంధన పెట్టిన వలంటీర్లు వాటిని తప్పుల తడకగా పూర్తిచేసి కాపునేస్తం నిధు లు రాకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. కృష్ణలంక పరిధిలోని 99 నుంచి 112 వరకు ఉ న్న సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపు పదేసి మందికి పథకాలు అందకుండా చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. జగనన్న సురక్షా పథకం ద్వారా నెల రోజుల పాటు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు రుసుము లేకుండా సచివాలయాల్లో జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అనేక వందల మంది మహిళలు దరఖాస్తులు చేసుకొన్నారు. జూలై 1 నుంచి నెలపాటు సాగిన ఈ మేళా లో జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు రావడంతో అవి పనికిరాకుండా పోయాయి. దీంతో వందలాది మంది కాపు మహిళల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ-సేవా కేంద్రాల్లో తీసుకొన్న ధ్రువీకరణ పత్రాలు పనికిరావంటూ వలంటీర్లు మళ్లీ మహిళలతో దరఖాస్తు చేయించారు. మూడుసార్లు పనికొచ్చిన ధ్రువీకరణ పత్రాలు ఇప్పుడు ఎం దుకు పనికిరావని ప్రశ్నిస్తే సచివాలయం ద్వారా వ చ్చినవే చెల్లుబాటు అవుతాయంటూ సమాధానం ఇస్తున్నారు. ఇవి తప్పుల తడకగా రావడం, కాపు నే స్తం దరఖాస్తు గడువు చివరకు రావడంతో సరిచేయించకుండానే దరఖాస్తుకు వాటిని జతచేసి పంపించేశారు. దీంతో అనేక మందికి ఆధార్‌లోని పేరుకు, ధ్రువీకరణ పత్రాల్లోని పేరుతో సరిపోకపోవడంతో నిధులు రాకుండా నిలిచిపోయాయి. అదేమని అడిగిన లబ్ధిదారులకు ఆమాటా ఈమాట చెబుతూ మ భ్యపెడుతూనే వున్నారు. గత నెల 18వ తేదీకే తప్పు లు దొర్లినట్లు, వాటి వల్లనే కాపు నేస్తం నిధులు నిలిచిపోయినట్టు తెలిసింది. వలంటీర్లు, వార్డు సిబ్బంది సరిచేయించేందుకు చర్యలు చేపట్టకుండా ఉండిపోయారు. కనీసం రెవెన్యూ విభాగం అప్రూవ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాలను కూడా ఇవ్వకుండా వలెంటీర్లు తమ వద్దే ఉంచుకుని ‘మీ దరఖాస్తు ఓకే అయింది, సీఎం నిధులు విడుదల చేయగానే బ్యాంకు ఖాతాల్లో చూసుకోండి’ అంటూ మభ్యపెట్టారు. తీరా పథకం తిరస్కరించబడిందని తెలిశాక లబ్ధిదారులు వలంటీ ర్లు, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా మాకు సం బంధం లేదు, కార్పొరేషన్‌కు వెళ్లండని తప్పించుకొం టున్నారే తప్ప తప్పులు దొర్లిన విషయాన్ని బయటపెట్టలేదు. అన్ని అర్హతలుండి మూడేళ్ల పాటు కాపునేస్తం అందుకున్న మహిళ సిబ్బందిని నిలదీయగా ‘ధ్రువీకరణ పత్రంలో మీ ఇంటి పేరు తప్పు పడింది, అందువల్ల మీ కులం ‘కాపు’ కాదని చూపిస్తోందని, అందుకరే తిరస్కరించడం జరిగిందని’ చావుకబురు చల్లగా చెప్పింది. దీంతో ఆ మహిళ వీఆర్‌వో, ఎంఆర్‌వో కార్యాలయం చుట్టూ తిరిగి సరైన సమాధానం రాకపోవడంతో చేసేదిలేక ఆగస్టు 29న ‘జగనన్నకు చెబుదాం టోల్‌ ఫ్రీ నెం 1902కు’ ఫిర్యాదు చేసింది.

టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు వెళ్లడం, నమోదు కా వడం, ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, న్యాయం చేయమని మెసేజ్‌లు రెవెన్యూ అధికారులకు రావడంతో విష యం బయటకు వచ్చింది. జూలై 7నే సర్టిఫికెట్‌ అ ప్రూవ్‌ అయినట్టు రికార్డులు చూపుతున్నా సచివాల యం సిబ్బంది బాధిత మహిళకు ఇవ్వడం కానీ, త ప్పు జరిగినట్టు తెలియజేయడం జరగలేదు. మీ కాపు నేస్తం ఆగింది, గ్రీవెన్స్‌ సెల్‌కు పంపాము, వెయిట్‌ చేయండి, 2024 జనవరిలో రెండో విడత వస్తుందం టూ అబద్దాలు చెబుతూ వస్తున్నారని బాధిత మహి ళ ఆవేదన వ్యక్తం చేసింది. టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యా దు చేసిన వారం రోజులకు రెవెన్యూ సిబ్బంది కుల ధ్రువీకరణ పత్రం తప్పుగా వచ్చిందని, సరిచేస్తున్నామని, మీరు సంతకం చేస్తే కొత్తదిస్తామని చెప్పి సం తకం చేయించుకొన్నారు. తీరా అది ఫిర్యాదును క్లోజ్‌ చేయడానికన్న విషయం బాధిత మహిళకు తెలియకపోవడం, ఈనెల 6న టోల్‌ ఫ్రీ నెం 1902 నుంచి మీ సమస్య పరిష్కరించాం, అంటూ మెసేజ్‌ వచ్చింది. ఈనెల 7న సమస్య పరిష్కామైంది కదా, సంతృప్తి చెందారా అని 1902 నుంచి బాధిత మహిళకు ఫోన్‌ వచ్చింది. ఏమీ జరగకుండానే సమస్య పరిష్కారం కావడమేమిటని అర్థంకాని మహిళ, సమస్య పరిష్కారం కాలేదు, నాకు సర్టిఫికెట్‌ జారీ జరగలేదు, కాపు నేస్తం జాబితాలో పేరు లేదు, నేను ఎలా సంతృప్తి చెందానని చెప్పమంటారని ప్రశ్నించడంతో ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తెస్తామంటూ 1902 సిబ్బంది ఫోన్‌ కట్‌ చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క కుల ధ్రువీకరణ పత్రం జారీలో జరిగిన ఇంటిపేరు తప్పు సరిచేయడానికి 2 నెలలు పట్టిందని, ఇంతవరకు సర్టిఫికెట్‌ ఇవ్వలేదని, కాపునేస్తం నిధులు జమకాకుండా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా జగనన్నకు చెబుదాం టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసినా సిబ్బందికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపునేస్తం ఇవ్వకుండా ఎగవేసే భాగంలోనే ఎంఆర్‌వో గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని, సచివాలయం ద్వారానే పొందాలని వలంటీర్లతో చెప్పించి బాధితులతో తిరిగి దరఖాస్తు చేయించి వాటిని తప్పుల తడకగా పూర్తి చేసి చివరికి వారికి కాపునేస్తం అందకుండా చేయడంలో ప్రభుత్వ హస్తం ఉందేమోనని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-20T01:21:12+05:30 IST