చంద్రబాబు మేనిఫెస్టోకు అపూర్వ స్పందన

ABN , First Publish Date - 2023-06-03T00:33:16+05:30 IST

రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబు మేనిఫెస్టోకు అపూర్వ స్పందన
కానూరులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 2 : రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. బందరు మండలం కానూరు గ్రామంలో చంద్రబాబు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. గోపు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి రైతుకు రూ. 20 వేలు అందిస్తే పెట్టుబడులకు సులభంగా ఉంటుందన్నారు. తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పడం వల్ల మహిళలు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళకు ఏడాదికి రూ. 18 వేలతో పా టు మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని చెప్ప డం హర్షణీయమన్నారు. రైతులు రామాంజనేయులు, నాని, కృష్ణ, రాము, సత్యనారాయణ, హరిబాబు, పెద్దిరాజులు, లంకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధం కావాలి

మచిలీపట్నం టౌన్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీడీపీ మచిలీ పట్నం మునిసిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. మచిలీపట్నం ఈడేపల్లి శక్తిగుడి సెంటర్‌లో 10వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు కట్టా రామ్‌చరణ్‌ తేజను శుక్రవారం సత్కరించారు. పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాజమండ్రిలో జరిగిన మహానాడు అనంతరం టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ఏర్పడిందన్నారు. మహిళలు, యువకులు మేనిఫెస్టోకు ఎంతో స్పందించారన్నారు. టీడీపీ నాయకులు యశ్వంత్‌ వర్మ, పి.వి.ఫణికుమార్‌, కొల్లేరు సత్యనారాయణ, సలీమ్‌, రామధాని వే ణు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతలను కించపరిచే బ్యానర్లను తొలగించాలి

మచిలీపట్నం టౌన్‌ : మచిలీపట్నంలో ప్రతిపక్ష నేతలను కించపరిచే విధంగా వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని కోరుతూ డీఆర్వో వెంకటేశ్వర్లుకు శుక్రవారం మచిలీపట్నం టీడీపీ నగర అధ్యక్షుడు ఎండి ఇలియా్‌సపాషా, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, టీడీపీ కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్‌ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఇలాంటి బ్యానర్ల వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-06-03T00:33:16+05:30 IST