అరాచక పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2023-07-22T01:59:34+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

అరాచక పాలనకు చరమగీతం
శేరీవర్తర్లపల్లిలో మేనిఫెస్టో వివరిస్తున్న కాగిత

పెడన రూరల్‌, జూలై 21 : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. శేరీవర్తర్లపల్లి, దిరిశవల్లి, మూల మర్రిగుంట గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోతో జరిగే ప్రయోజనాలను వివరించారు. భవిష్యత్‌కు భరోసా టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తులై టీడీపీకి ఓటేసి చంద్రబాబును ముఖ్య మంత్రిని చే యాలని పిలుపునిచ్చారు. శలపాటి ప్రసాద్‌, శీరం ప్రసాద్‌, పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, బొల్లా నాగేశ్వరరావు, గంధం గోపాలకృష్ణ, హన్ను, నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-22T01:59:34+05:30 IST