సమస్యలు పట్టని వైసీపీ పాలకులు

ABN , First Publish Date - 2023-04-09T00:25:22+05:30 IST

మచిలీపట్నం నగరంలో ప్రధాన సమస్యలను పాలకవర్గం పట్టించుకోవడం లేదని జనసేన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ ధ్వజమెత్తారు.

సమస్యలు పట్టని వైసీపీ పాలకులు
ఏడో డివిజన్‌లో సమస్యలను తెలుసుకుంటున్న నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 8 : మచిలీపట్నం నగరంలో ప్రధాన సమస్యలను పాలకవర్గం పట్టించుకోవడం లేదని జనసేన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఏడో డివిజన్‌లో పర్యటించారు. బండి రామకృష్ణ మాట్లాడుతూ, చిలకలపూడి రోల్డుగోల్డు పరిశ్రమకు మణిహారమన్నారు. కోట్లాది రూపాయల వ్యాపారాలు జరుగు తున్నాయని, వేలాది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, దీని వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూ డా సమకూరుతోందన్నారు. అయినప్పటికీ రోల్డుగోల్డు కార్మికులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధిపై పాలకులు శ్రద్ధ చూపడం లేదన్నారు. చిలకలపూడిలో డ్రెయిన్లు సరిగాలేక మురుగు పొంగి పొర్లుతోందన్నారు. యానాదుల కాలనీలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదన్నారు. జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, మహమ్మద్‌ సమీర్‌, చౌదరి, పినిశెట్టి వేణు, త్రిపురారి తరుణ్‌, మణిబాబు, తిరుమలశెట్టి నాగరాజు, అనుమకొండ ఆంజనేయులు పాల్గొన్నారు.

లింగన్నకోడుపై వంతెన నిర్మించాలి

కోడూరు : నరసింహాపురం గ్రామ సమీపాన లింగన్నకోడుపై కూలిన వంతెనను వెంటనే పునర్నిర్మాణం చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం కూలిన వంతెనపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కోడూరు మండల కేంద్రానికి, సాలెంపాలెం, వేణుగోపాలపురం గ్రామాలకు అతి తక్కువ దూరంలో వెళ్లేందుకు ఈ వంతెన దోహదపడుతుం దన్నారు. అదేవిధంగా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి తీసుకొచ్చుకునేందుకు ఈ వంతెన అత్యంత ప్రధానమైనదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన పునర్నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. జనసేన మండల అధ్యక్షుడు మర్రె గంగయ్య, బాసు నాంచారయ్య నాయుడు, కనగాల వెంకటేశ్వరరావు, తోట సోమశేఖర్‌, కోట రాంబాబు, బండే గోపాలకృష్ణ, స్థానిక మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-09T00:25:22+05:30 IST