కార్మిక సంక్షేమ బోర్డుకు జగన్ తూట్లు
ABN , First Publish Date - 2023-12-11T00:34:45+05:30 IST
భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచిన జగన్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఉమ్మర్‌వలి హెచ్చరించారు.
తిరువూరు, డిసెంబరు 10: భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచిన జగన్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఉమ్మర్‌వలి హెచ్చరించారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏపీ బిల్డింగ్ అండ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మర్ వలి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జగన్మోహనరెడ్డి తూట్లు పొడుత్తూ రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన సుమారు 50 లక్షల మంది కార్మికుల కడుపులు కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణరంగం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టం 1996 దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంటే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ బోర్డుపట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నా రన్నారు. బోర్డులో సభ్యత్వం పేరుతో కార్మికుల నుంచి, సెస్‌పేరుతో భవన యాజమానుల నుంచి వసూళ్లు చేస్తున్న నగదును ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు చెల్లించాలని, దారిమళ్లించిన రూ.1200 కోట్ల బోర్దు నిధులు తిరిగి బోర్డుకు జమచేయాలని డిమాండ్ చేశారు. ఎస్.కె.నాగులుమీరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గం కార్యదర్శి కొత్తపల్లి సుందరరావు, ఎం.ప్రసాద్, ముత్తయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.