Share News

జగనాసురుడిపై పోరు ఉధృతం

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:20 AM

ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని క్రైస్తవులనూ నట్టేట ముంచి మొండి చేయి చూపిన జగనాసురుడిపై పోరాటాన్ని ఉధృతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పోరంకి 1వ డివిజన్లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి. జగన్‌ పరిపాలన సాగిస్తున్నాడన్నారు.

 జగనాసురుడిపై పోరు ఉధృతం
పోరంకిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలతో బోడె ప్రసాద్‌

పెనమలూరు, డిసెంబరు 25 : ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని క్రైస్తవులనూ నట్టేట ముంచి మొండి చేయి చూపిన జగనాసురుడిపై పోరాటాన్ని ఉధృతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పోరంకి 1వ డివిజన్లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి. జగన్‌ పరిపాలన సాగిస్తున్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్‌ విద్యా పథకం బీఏఎస్‌, విదేశీ విద్యాపథకాలను క్రైస్తవులకు దూరం చేసి విద్యార్ధులుపై చదువులకు వెళ్లకుండా అడ్డుకున్నాడని దుయ్యబట్టారు. రాజమండ్రి మేనిఫెస్టోలోని అంశాలతో కూడిన కరపత్రాలను అందజేసి పథకాల ద్వారా ఎవరికి ఎంత లబ్ధి చేకూరనుందో తెలిపే బాండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగెపు రంగారావు, కంచర్ల సుకన్య, కంచర్ల పూర్ణచంద్రరావు, ఆచంట వెంకటచంద్ర, హిమజ, తుమ్మల గోపాలకృష్ణ, పోలవరపు వెంకటేశ్వరరావు, వెలివెళ్ల రామకృష్ణ, నాయని పాండురంగారావు, పావులూరి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ సుభాష్‌చంద్రబోస్‌, మండవ నరేంద్రకుమార్‌, సోమవరపు సాయికృష్ణ, ఉప్పులూరి సుబ్బయ్య, యాళ్ల చక్రవర్తి, దండమూడి సాయిసుధ తదితరులు పాల్గొన్నారు.

యనమలకుదురులో..

యనమలకుదురు 64, 65బూత్‌ల పరిధిలో జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో అనంతనేని ఆజాద్‌ ఆధ్వర్యంలో జగన్‌రెడ్డి అరాచక పాలన గురించి, టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించి పథకాల వల్ల వచ్చే లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో తమ్ము అశోకచక్రవర్తి, బలగం నాగరాజు, కళ్యాణపు శ్రీనివాస్‌, వెలగపూడి శేఖర్‌, మాచిన శివ, గండికోట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల దగా..

ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు పలు హామీలిచ్చి ఓట్లు దండుకొని అధికారం చేపట్టిన తర్వాత జాబ్‌ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులను జాబ్‌లెస్‌గా మార్చి జగన్‌రెడ్డి దారుణంగా మోసం చేశాడని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర ధ్వజమెత్తారు. సోమవారం కానూరు, 31వ బూత్‌ పరిధిలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొని స్థానికులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి వేల కొద్దీ ఉపాఽద్యాయ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. సచివాలయ ఉద్యోగా లు, వలంటీర్‌ ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను మభ్యపెట్టి వారిని తమ ఏజెంట్లుగా మార్చుకొన్న ఘనత జగన్‌రెడ్డిదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరాన్ని స్థానికులకు వివరించారు. రాజమండ్రి మేనిఫెస్టోలోని అంశాలతో కూడిన కరపత్రాలను పంపి ణీ చేశారు. కార్యక్రమంలో షేక్‌ రఫీ, ఇమాం, పెద్ద రఫీ, బాషా, కోసూరు రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:20 AM