జగనన్న సురక్ష విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-06-21T00:32:09+05:30 IST

జగనన్న సురక్షను విజయవంతం చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పిలుపునిచ్చారు.

జగనన్న సురక్ష విజయవంతం చేయాలి

జగనన్న సురక్ష విజయవంతం చేయాలి

నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

వన్‌టౌన్‌, జూన్‌ 20 : జగనన్న సురక్షను విజయవంతం చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో మంగళవారం వార్డు స్థాయి ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఆరు పర్యవేక్షణ బృందాలకు జగనన్న సురక్షపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, ఇతరత్రా లబ్ధిలు పొందేందుకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేసేందుకు జూలై 1 నుంచి వారంలో మూడు రోజుల చొప్పున 5 వారాలు వార్డు సచివాలయాల వద్ద జగనన్న సురక్ష జరుగుతుందన్నారు. శిబిరం నిర్వహణకు వారం ముందు వలంటీర్లు తమ క్లస్టర్లలోని ఇంటింటికీ తిరిగి ప్రజావసరాలకు అనుగుణంగా ఏయే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారన్నది తెలిపి వారిని శిబిరం వద్దకు వచ్చేలా సన్నాహాలు చేయాలన్నారు. కులం, ఆదాయం, జననం, మరణం, వివాహ, కుటుంబ సభ్యుడు ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్‌ లావాదేవీలు, ఆధార్‌కు ఫోన్‌ నెంబరు అనుసంధానం, పంటసాగు హక్కు వంటి పత్రాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించనన్నారు. అదనపు కమిషనర్లు కేవీ సత్యవతి, ఎం శ్యామల, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T00:32:09+05:30 IST