ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్‌

ABN , First Publish Date - 2023-02-07T00:42:10+05:30 IST

ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు.

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్‌
మందులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్‌

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

గుణదల, ఫిబ్రవరి 6: ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 5వ డివిజన్లో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి చలపాటి వెంకట నారాయణ జ్ఞాపకార్థం అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గద్దె మాట్లాడుతూ వెయ్యి రూపాయల వైద్యం ఖర్చు దాటితే తామే భరిస్తామని చెప్పిన హామీ ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఏర్పాటు చేసిన బోర్డుల కిందనే గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న 400మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదానం చేశారు. 5వ డివిజన్‌ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్‌, చెన్నుపాటి గాంధీ, కోడూరు సుబ్రహ్మణ్యం, ఎస్‌.కె.షరీఫ్‌, పల్లెపు చంద్రమౌళి, కె.కాళీ, గుడిపాటి కెనడి, షేక్‌ షకీల, బూరగడ్డ వరప్రసాద్‌, గుళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:42:12+05:30 IST