అక్షరం విలువ తెలియని జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-09-26T01:17:24+05:30 IST

అక్షరం విలువ తెలియని జగన్‌రెడ్డి అరాచకాలు చేస్తున్నాడని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ అన్నారు.

అక్షరం విలువ తెలియని జగన్‌రెడ్డి

వన్‌టౌన్‌, సెప్టెంబరు 25: అక్షరం విలువ తెలియని జగన్‌రెడ్డి అరాచకాలు చేస్తున్నాడని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ విద్యార్థులతో కలిసి ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం దీక్షలో పాల్గొన్నారు. అ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ముందు చూపువల్లే నైపుణ్యం కలిగిన యువత దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. అక్షరం విలువ తెలియని జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని, పాలన సక్రమంగా లేదని, ప్రతిపక్షాన్ని, ప్రజలను అసెంబ్లీలో మంత్రులు అవహేళనగా సంబోధిస్తున్నారని విమర్శించారు. సమన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కళాశాల అధినేత్రి సమన మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపు వల్లే వివిధ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో యువత తక్కువ వ్యయంతో చదువుకుంటున్నారన్నారు. రాధారంగ మిత్రమండలి సభ్యుడు ముళ్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రతి మహిళ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ముమ్మనేని ప్రసాద్‌, గద్దె ప్రసాద్‌, రాయి రంగమ్మ, వేముల దుర్గారావు, మాదాల చిన్న తల్లి, కొలసాని నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:17:24+05:30 IST