Share News

మా పాస్‌పుస్తకాలపై మీ బొమ్మలేంటి జగన్‌రెడ్డీ?

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:51 AM

‘‘రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి తెచ్చింది భూ హక్కు పథకం కాదు. భూ భక్ష పథకం. పాస్‌ పుస్తకాలపై రైతు ఫొటో రెండు సార్లు ఉంటే జగన్‌రెడ్డి ఫొటో 9 సార్లు ఉంది. మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపై మీ బొమ్మలేంటి జగన్‌రెడ్డీ’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

మా పాస్‌పుస్తకాలపై మీ బొమ్మలేంటి జగన్‌రెడ్డీ?
పాస్‌పుస్తకంపై వైఎస్సార్‌, జగన్‌ ఫొటోలు చూపుతున్న దేవినేని ఉమా

సీఎంకు మాజీ మంత్రి ఉమా ప్రశ్న

జి.కొండూరు, డిసెంబరు 23: ‘‘రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి తెచ్చింది భూ హక్కు పథకం కాదు. భూ భక్ష పథకం. పాస్‌ పుస్తకాలపై రైతు ఫొటో రెండు సార్లు ఉంటే జగన్‌రెడ్డి ఫొటో 9 సార్లు ఉంది. మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపై మీ బొమ్మలేంటి జగన్‌రెడ్డీ’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. విద్యుత్‌ సరఫరా సరిగ్గా ఇవ్వక ఎండుతున్న పంటలను పరిశీలించేం దుకు దుగ్గిరాలపాడు వెళ్లిన ఆయన వద్దకు గోపాలకృష్ణయ్య అనే రైతు వచ్చారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన పాస్‌ పుస్తకాన్ని చూపారు. రైతు పాస్‌పుస్తకంలో వేరొకరి ఫొటోతో పాటు పక్క రాష్ట్రం ఫోన్‌ నంబరు వేసి ఉందని యజమానిగా చూపే ఏ ఆధారం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. భూ యాజమాన్యపు హక్కు వివరాలు లేకుండా సర్వే నంబర్లు పాస్‌పుస్తకంలో చూపించి జగన్‌రెడ్డి ఫొటో ఒక వైపు, ఆయన తండ్రి వైఎస్సార్‌ ఫొటో మరోవైపు ముంద్రించిన పాస్‌ పుస్తకాలు ఇచ్చారన్నారు. దీంతో రైతులకు ప్రమాదముందని, రైతుల హక్కులను హరిస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని ఉమా హెచ్చరించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 12:51 AM