Share News

పంట నష్టం అంచనాలో జగన్‌రెడ్డి విఫలం

ABN , First Publish Date - 2023-12-11T00:54:46+05:30 IST

తుఫాన్‌ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్‌ అన్నారు.

పంట నష్టం అంచనాలో జగన్‌రెడ్డి విఫలం

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాంగౌడ్‌ విమర్శ

విద్యాధరపురం, డిసెంబరు 10: తుఫాన్‌ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్‌ అన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిచౌంగ్‌ తుఫాన్‌పై వారం ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా జగన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం మిన్నకున్నాయన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌రెడ్డి చేలో కాలు పెట్టకుండా రోడ్లపై స్టేజీలు వేయించుకుని సైడ్‌ ఆర్టిస్టులను పిలిపించుకుని డ్రామా నడిపాడన్నారు. చివరికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు చేలల్లోకి దిగి, రైతులకు సాంత్వన కలిగిస్తున్న తీరు అభినందనీయమన్నారు.

Updated Date - 2023-12-11T00:54:47+05:30 IST